January 2020 బాక్స్ ఆఫీస్ రీపోర్ట్

January 2020 బాక్స్ ఆఫీస్ రీపోర్ట్
x
Highlights

ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ భారీ వసూళ్ళతోనే ప్రారంభం అయింది. సంక్రాంతికి మొదలైన ఈ జోరు ఎ సంక్రాంతికి ఎ సినిమా కూడా చూడనంత వసూళ్లను సాధించాయి.

ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ భారీ వసూళ్ళతోనే ప్రారంభం అయింది. సంక్రాంతికి మొదలైన ఈ జోరు ఎ సంక్రాంతికి ఎ సినిమా కూడా చూడనంత వసూళ్లను సాధించాయి. జనవరి మొదటివారంలో అరడజన్ సినిమాలు వచ్చాయి. అందులో బ్యూటిఫుల్, తూట, అతడే శ్రీమన్నారాయణ, ఉల్లాలఉల్లాల, వైఫ్ ఐ సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలు వేటికవే ప్లాపులను సొంతం చేసుకున్నాయి. రంగీలాకు నీరాజనం అంటూ వచ్చిన వర్మ బ్యూటిఫుల్ చిత్రం రంగీలా పరువు తీసిందన్న టాక్ ని మూటగట్టుకుంది. ఇక పాన్ ఇండియా మూవీగా వచ్చిన అతడే శ్రీమన్నారాయణ ప్లాపుగానే మిగిలిపోయింది. ఇక ఉల్లాలఉల్లాల, వైఫ్ ఐ చిత్రాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచింది.

ఇక రెండోవారం బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల మోట మొదలైంది. జనవరి 9 న రజినీకాంత్ దర్బార్ చిత్రం ధియేటర్లోకి వచ్చింది. ఈ సినిమా రజినీ ఇంతకుముందు సినిమాల కంటే బెటర్ అనిపించింది. ఇక మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు జనవరి 11 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి టాక్ ని సంపాదించుకొని మహేష్ కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక అ మరుసటి రోజే అల్లు అర్జున్, త్రివిక్రమ్ అల వైకుంఠపురములో చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ ని సంపాదించుకుంది. సినిమాకి భారీ వసూళ్ళే వచ్చాయి. ఇక మహేష్ సినిమాతో కంపైర్ చేస్తే ఈ సినిమా ఓవర్సీస్ వసూళ్ల పరంగా చూసుకుంటే బన్ని సినిమానే సంక్రాంతి విన్నర్ గా చెప్పుకోవచ్చు.

ఇక సరిగ్గా సంక్రాంతి రోజు అంటే జనవరి 15 న కళ్యాణ్ రామ్ హీరోగా ఎంత మంచివాడవురా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా కాన్సెప్ట్ పై ఉన్న నమ్మకం, ఫ్యామిలీ సినిమా కావడంతో ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేశారు. కానీ అనుకున్నంతగా టాక్ రాకపోవడంతో సినిమా చతికలపడింది. ఇక గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 24 న రవితేజ డిస్కోరాజా సినిమా విడుదలైంది.

సినిమాకి మంచి టాక్ వచ్చినప్పటికీ వసూళ్ళ పరంగా సినిమా వెనుకబడిందనే చెప్పాలి. ఇక నెల చివరిలో డబ్ స్మాష్, అశ్వథ్థామ, చూసీ చూడంగానే సినిమాలొచ్చాయి. కానీ ఇందులో నాగశౌర్య అశ్వథ్థామ సినిమాకి మంచి టాక్ అయితే సంపాదించుకుంది. ఇక బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల సంగతి తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే..

దాదాపుగా ఈ జనవరి నెలలో బాక్సాఫీస్ బరిలో 20 సినిమాలు నిలిస్తే మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు, అ;అల్లు అర్జున్ అల వైకుంఠపురములో చిత్రాలు బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories