బాహుబలికి విలన్ గా జగ్గూభాయ్‌

బాహుబలికి విలన్ గా జగ్గూభాయ్‌
x
Highlights

ప్రేమ, కుటుంబ కథచిత్రాల హీరోగా వెండితెరపై మెరిసిన జగపతిబాబు తన రెండో ఇన్నింగ్స్ లో మాత్రం పూర్తిగా ప్రతినాయకుడిగా మారి టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ విలన్ గా మారిపోయాడు.

ప్రేమ, కుటుంబ కథచిత్రాల హీరోగా వెండితెరపై మెరిసిన జగపతిబాబు తన రెండో ఇన్నింగ్స్ లో మాత్రం పూర్తిగా ప్రతినాయకుడిగా మారి టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ విలన్ గా మారిపోయాడు. లెజెండ్, రంగస్థలం, నాన్నకు ప్రేమతో, అరవింద సమేత వీర రాఘవ వంటి చిత్రాలలో అద్భుతమైన నటనని కనబరిచి టాప్ విలన్ గా కొనసాగుతున్నాడు. ఇప్పుడు ఆయన హీరో ప్రభాస్ కి విలన్ గా చేయనున్నడని తెలుస్తోంది! ఇందులో జగ్గూభాయ్‌ లుక్ నుంచి సంభాషణలు వరకు అన్ని సరికొత్తగా ఉంటాయని తెలుస్తోంది!

జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హేగ్దే కథానాయకగా నటిస్తోంది. ఇది ప్రభాస్ కి 20వ చిత్రం.. ప్రస్తుతం షూటింగ్ శేరవేగంగా జరుపుకుంటుంది . పునర్జన్మల నేపథ్యంలో ఈ సినిమా తెరకేక్కుతుందని సమాచారం. ఈ సినిమాకి జాన్ అనే టైటిల్ ని పరిశీలనలో ఉంచారు. కానీ మార్చనున్నారని తెలుస్తోంది! ఓ డియర్, రాధే శ్యామ్ అనే టైటిల్స్ ని అనుకుంటున్నారు. ఈ సినిమాలో అలనాటి బాలీవుడ్‌ అందాల తార భాగ్యశ్రీ ఓ కీలక పాత్ర నటిస్తుంది. ఈ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేస్తున్నారు.

తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కమల్ కన్నన్ ఈ చిత్రానికి విఎఫ్ఎక్స్ విభాగంలో పనిచేస్తుండడం విశేషం.. గత ఏడాది వచ్చిన సాహో సినిమా కలెక్షన్ల పరంగా ఒకే అనిపించిన కథ పరంగా డిస్పాయింట్ చేయడంతో ఫ్యాన్స్ ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories