మహేష్ సినిమా నుంచి తప్పుకున్న జగపతి బాబు?

మహేష్ సినిమా నుంచి తప్పుకున్న జగపతి బాబు?
x
Looks like Jagapathi Babu, one of the most wanted baddies in the south Indian film circuit, is not a part of Mahesh Babu's Sarileru Neekevvaru movie.
Highlights

సూపర్ స్టార్ మహేష్ బాబు, జగపతి బాబు కాంబినేషన్ లో అన్నీ సూపర్ హిట్ సినిమాలే. వారిద్దరూ కల్సి తెర మీద కనిపిస్తే చక్కగా ఉంటుందని అటు దర్శకులు.. ఇటు...

సూపర్ స్టార్ మహేష్ బాబు, జగపతి బాబు కాంబినేషన్ లో అన్నీ సూపర్ హిట్ సినిమాలే. వారిద్దరూ కల్సి తెర మీద కనిపిస్తే చక్కగా ఉంటుందని అటు దర్శకులు.. ఇటు ప్రేక్షకులు భావిస్తారు. ఇప్పుడు వీరిద్దరూ కలసి నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఆర్మీ ఆఫీసర్ గా మహేష్ బాబు నటిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు ఒక కీలకమైన పాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది.

అయితే, ఈ సినిమా నుంచి జగపతి బాబు తప్పుకున్నారనే వార్తలు వస్తున్నాయి. జగపతి బాబు బదులు ప్రకాష్‌రాజ్‌ ఆ పాత్రలో చేయబోతున్నారనేది టాక్. షూటింగ్‌లో పాల్గొనేందుకు కాశ్మీర్‌ వెళ్లిన జగ్గుభాయ్ తన పాత్రను ముందుగా చెప్పినట్టుగా తెరకెక్కించకపోవటంతో ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టుగా టాలీవుడ్ లో చెప్పుకుంటున్నారు. అధికారికంగా ఈవార్త కన్ఫర్మ్ కాలేదు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories