Jabardasth: రాత్రి అక్కడ షో.. పొద్దున్నే ఇక్కడ షో.. నిద్దర రాదా మరి..అనసూయ పై ఆది పంచ్!

Jabardasth: రాత్రి అక్కడ షో.. పొద్దున్నే ఇక్కడ షో.. నిద్దర రాదా మరి..అనసూయ పై ఆది పంచ్!
x
Jabardasth latest promo images (Mallemala youtube screenshots)
Highlights

హైపర్ ఆది మామూలోడు కాదు. దొరికితే పంచ్ లతో అవతలి వాళ్లకు మాట రాకుండా చేస్తాడు. వాళ్ళూ వీళ్ళూ అని కాదు అది రాజకీయమైనా కావచ్చు.. తాజా సినిమా కావచ్చు.. సెట్ లో యాంకర్ కావచ్చు..

హైపర్ ఆది మామూలోడు కాదు. దొరికితే పంచ్ లతో అవతలి వాళ్లకు మాట రాకుండా చేస్తాడు. వాళ్ళూ వీళ్ళూ అని కాదు అది రాజకీయమైనా కావచ్చు.. తాజా సినిమా కావచ్చు.. సెట్ లో యాంకర్ కావచ్చు.. అన్నిటికీ మించి తాను చేస్తున్న కార్యక్రమ నిర్వాహకుల మీద కావచ్చు ఆది పంచ వెస్తే తిరుగుండదు అంతే! ఇది ప్రేక్షకుల మాట. అనుదుకే జబర్దస్త్ పేరు చెబితే ఆది పేరే ముందు గుర్తుకు వస్తుంది. ఆది వేసే పంచ్ లకి ఫైర్ బ్రాండ్ రోజా కూడా నవ్వుతూనే ఉంటారంటే అర్థం చేసుకోవచ్చు ఆది పంచ్ లు ఎలా ఉంటాయో.

అనసూయకు అదిరిపోయే పంచ్!

ఈరోజు గురువారం..(23 జనవరి) ప్రసారం అవ్వబోయే జబర్దస్త్ కామెడీ షో ప్రోమోలో కురిసిన ఆది పంచ్ ల వర్షం చూస్తె ఒక రేంజిలో వినిపించాయి. ఆటోలో దిగిన ఆది దిగుతూనే వేసిన పంచ్..''ఒర్..ఇది ఆటోనా.. అల వైకుంఠపురములో ఆడియో ఫన్క్షనా? ఇంతమంది ఉన్నారెంట్రా లోపల..'' అంతే ఇక నవ్వుల నజరానా మొదలైపోయింది. ఇక ఓ రెండు పంచ్ లు వరుసగా ఆటో డ్రైవర్ మీద వేసిన తరువాత ఆది అనసూయకు.. జబర్దస్త్ షో నిర్వాహకులకు కలిపి భారీ స్థాయిలో వేసిన పంచ్ మామూలుగా పేలలేదు. ఆటోలోంచి బద్ధకంగా దిగిన అనసూయ ''బావా..నిద్దర పట్టేసింది బావా..'' అని అది తో అంటుంది. వెంటనే ఆది ''పొద్దున్నే ఈ షో పెట్టుకుని రాత్రి ఆ షోకి వెళితే నిద్దరే పట్టుద్ది.'' అని భారీగా పంచ వేసి అనసూయకు షాకిచ్చాడు. (అనసూయ ఇటు జబర్దస్త్ లోనూ.. అటు జీ తెలుగులో ప్రసారం అవుతున్న కామెడీ షో లోనూ చేస్తున్న సంగతి తెలిసిందే) అలా ఒక్క పంచ్ తో వదిలేస్తే ఆది ఎందుకు అవుతాడు.. వరుసగా రెండు పంచ్ లు ఈ విషయంపై వదిలేశాడు. ఈసారి రెండు షౌల నిర్వాహకులు టార్గెట్ అయిపోయారు. అదే.. ''ఈటీవీలో మధ్యాహ్నం ప్రతిరోజూ పండగ అంటావు..ఇక్కడ జబర్దస్త్ అంటావు.. ఎమన్నా అంటే ఇల్లంటావు..ఈఎంఐ అంటావు.. ఎందుకంటే నువ్వు అందంగా ఉంటావు.. వీళ్ళు వదులుకోలేరు. వారు వదల లేరు.. ఏం చేస్తాం.'' ఇలా వరుసగా గుక్క తిప్పుకోకుండా వచ్చిన డైలాగులకు సెట్టంతా పడీ పడీ నవ్వింది.

రోజానీ వదల్లేదు..

ఆటో దిగిన ఆది భార్య రొజాని ఉద్దేశించి ''ఈవిడ చిరంజీవి గారితో చామంతి పువ్వా.. అని బాలక్రిష్ణ గారితో చిక్కింది చామంతి పువ్వు అని డాన్స్ చేసింది ఈవీడే కదా అంటుంది.'' దానికి ఆది అవును..అంటే.. అతని భార్య క్యారెక్టర్.. ''అప్పటికీ ఇప్పటికీ అలానే ఉన్నారుగా'' అని బిస్కెట్ వేసింది. ఆ బిస్కెట్లు ఆది తో కుదరవుగా.. వెంటనే..''ఆవిడే కానీ, కొంచెం తేడా వుంది. అప్పట్లో రోజాగారిని చూసి జనం చేయి ఊపేవారు. ఇప్పుడు ఆమే జనం దగ్గరకు వెళ్లి చేతులు ఊపెస్తున్నారు'' అంటూ భారీ స్థాయిలో పంచ్ వేశాడు. అంతే కొద్దిగా షాకైనా.. వెంటనే తేరుకున్న రోజా గట్టిగా నవ్వేసి ''ఎం చేస్తాం సేచ్యుఎషన్ అలా డిమాండ్ చేస్తోంది'' అన్నారు. (నిజమే కదా..పాపం!).

ఇక ప్రోమోలో మొత్తం నవ్వుల పంచ్ లు విపరీతంగా కనిపించాయి. ఇక ఈరోజు రాత్రి ప్రసారం అయ్యే జబర్దస్త్ షో చూసి కడుపుబ్బా నవ్వుకోవడానికి సిద్ధం అయిపోదాం.

ఈలోపు ఈ ప్రోమో చూసి నవ్వేసుకుందాం..




Show Full Article
Print Article
More On
Next Story
More Stories