మీకు బుర్ర లేదు నెటిజన్ కి కౌంటర్ ఇచ్చిన అనసూయ

మీకు బుర్ర లేదు నెటిజన్ కి కౌంటర్ ఇచ్చిన అనసూయ
x
యాంకర్ అనసూయ
Highlights

సినీతారలను నెటిజన్లు ట్రోల్స్ చేయడం అనేది కామన్.. దీనిని కొందరు లైట్ తీసుకుంటే మరి కొందరు మాత్రం సీరియస్ గా తీసుకొని తగిన జవాబు ఇస్తారు.

సినీతారలను నెటిజన్లు ట్రోల్స్ చేయడం అనేది కామన్.. దీనిని కొందరు లైట్ తీసుకుంటే మరి కొందరు మాత్రం సీరియస్ గా తీసుకొని తగిన జవాబు ఇస్తారు. అందులో భాగంగానే ఇప్పుడు జబర్దస్త్ యాంకర్ అనసూయకి ఇలాంటి పరిస్థితి ఎదురైంది. ఎప్పటికప్పుడు తనకి సంబధించిన అప్డేట్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది అనసూయ. ఈ నేపధ్యంలో తాజాగా అనసూయ రెడ్ బ్లౌజ్, వైట్ శారీలో దిగిన కొన్ని ఫోటోల్ని తన సోషల్ మీడియా పేజీల్లో పోస్టు చేసింది.

అయితే దీనిపైన ఓ నెటిజన్ స్పందిస్తూ 'అనసూయ గారు మీకు పెళ్లైంది... మీకు ఇవన్నీ అవసరమా ? ' అంటూ ప్రశ్నిస్తూ రిప్లై ఇచ్చాడు. అయితే దీనిపైన అనసూయ రిప్లై ఇచ్చింది. జగదీష్ గారు మీకు బుర్రలేదు మీకు ఇలా నాతో మాట్లాడటం అవసరమా చెప్పండి అంటూ కౌంటర్ వేసింది అనసూయ.. అతనికి మంచి రిప్లై ఇచ్చారంటూ మిగతా నెటిజన్లు కామెంట్స్ చేయడం విశేషం.

ప్రస్తుతం జబర్దస్త్ లో యాంకర్ గా కొనసాగుతూనే మంచి పాత్రలు వచ్చినప్పుడు వెండితెరపై మెరుస్తుంది ఈ జబర్దస్త్ బ్యూటి. తాజాగా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న రంగామర్తండ సినిమాలో అనసూయకి మంచి పాత్ర దక్కిందని తెలుస్తుంది. దీనిపైన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories