వినోదిని కేసులో నిందితులకు రిమాండ్

వినోదిని కేసులో నిందితులకు రిమాండ్
x
Highlights

జబర్దస్ట్ నటుడు వినోద్ అలియాస్ వినోదిని పై ఈ మద్య కొందరు అటాక్ చేసిన సంగతి తెలిసిందే . ఇందులో అతని ఎడమ కంటికి తీవ్ర గాయాలు అయ్యాయి . ఓ ల్యాండ్...

జబర్దస్ట్ నటుడు వినోద్ అలియాస్ వినోదిని పై ఈ మద్య కొందరు అటాక్ చేసిన సంగతి తెలిసిందే . ఇందులో అతని ఎడమ కంటికి తీవ్ర గాయాలు అయ్యాయి . ఓ ల్యాండ్ విషయంలో వివాదం కాస్తా గొడవకు దారి తీసింది . అయితే అతనిపై దడి చేసిన నిందితులు ఈ రోజు కోర్టులో హాజరయ్యారు . వినోదిని అద్దెకు ఉంటున్న ఇంటి యజమాని బాలాజీ, అతని భార్య ప్రమీల, వారి కుమారులు, కోడలు కలిసి అతనిపైన దాడికి పాల్పడ్డారు. తన దగ్గర పది లక్షల రూపాయలు తీసుకోని బుకాయించడమే కాకుండా తనపైన దాడికి దిగారని వినోదిని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు . అతని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసారు . కాగా నిందితులు పోలీసుల వద్ద లొంగిపోవడంతో వారిని కోర్టులో హాజరు పరిచారు . వీరిని కోర్టు రిమాండ్ కి తరలించమని ఆదేశించగా , చెంచల్ గూడ జైలుకి తరలించారు . వారికి శిక్ష విధించాలని వినోదిని తల్లి కోరుతుంది .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories