'జాను' 2 డేస్ కలెక్షన్స్..

జాను 2 డేస్ కలెక్షన్స్..
x
Highlights

శర్వానంద్, సమంత హీరోహీరోయిన్ గా నటించిన తాజా చిత్రం 'జాను'... తమిళ్ లో మంచి హిట్ అయిన '96' సినిమాకి ఇది రీమేక్ ... శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్...

శర్వానంద్, సమంత హీరోహీరోయిన్ గా నటించిన తాజా చిత్రం 'జాను'... తమిళ్ లో మంచి హిట్ అయిన '96' సినిమాకి ఇది రీమేక్ ... శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు ఈ సినిమాని నిర్మించగా, సి.ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించాడు. . ఫిబ్రవరి 7న (శుక్రవారం) విడుదలైన ఈ సినిమా మొదటి షో నుంచే మంచి టాక్ ను సొంతం చేసుకుంది. 96 సినిమాలోని ఫీల్ ని రీక్రియేట్ చేసారని అభిమానులు చాలా ఫీల్ అయ్యారు. ఇక సమంత, శర్వానంద్ లు తమ నటనతో మెప్పించి సినిమాకే హైలెట్ గా నిలిచారు. దీంతో మొదటి రోజు ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ లభించాయి. మొదటిరోజు ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 2.73 కోట్లను సాధించింది. ఇక రెండవరోజు మంచి కలెక్షన్లను సాధించి దూసుకుపోతుంది.

ఇక రెండవరోజు ఈ చిత్రానికి కలెక్షన్స్ ఇలా ఉన్నాయి..

నైజాం 1.61 cr

సీడెడ్ 0.49 cr

ఉత్తరాంధ్ర 0.57 cr

ఈస్ట్ 0.26 cr

వెస్ట్ 0.18 cr

కృష్ణా 0.27 cr

గుంటూరు 0.37 cr

నెల్లూరు 0.11 cr

రెస్ట్ ఆఫ్ ఇండియా 0.30 cr

ఓవర్సీస్ 0.64 cr

వరల్డ్ వైడ్ టోటల్ 4.80 cr (share)

'96' సినిమాకి రీమేక్ కావడం, సమంత, శర్వానంద్ లాంటి కాస్ట్ కావడంతో సినిమాపైన మంచి అంచనాలు పెరిగాయి. దీనితో ఈ సినిమా విడుదలకి ముందు 21 కోట్ల బిజినెస్ జరిగినట్టుగా తెలుస్తోంది. ఇక మొదటి రోజు ఈ చిత్రం 2.73 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇంకా బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే మరో 16.20 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories