సమంత, శర్వానంద్ 'జాను' ఫస్ట్ లుక్ వచ్చేసింది!

సమంత, శర్వానంద్ జాను ఫస్ట్ లుక్ వచ్చేసింది!
x
Highlights

త్రిష, విజయ్‌ సేతుపతి జంటగా నటించిన `96`సినిమా ఎంత పెద్ద హిట్టయిందో పెద్దగా చెప్పాలిసిన అవసరం లేదు.

త్రిష, విజయ్‌ సేతుపతి జంటగా నటించిన `96`సినిమా ఎంత పెద్ద హిట్టయిందో పెద్దగా చెప్పాలిసిన అవసరం లేదు. కేవలం హిట్టు మాత్రమే కాదు. ఈ సినిమాకి ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో జాను అనే పేరుతో తెరకెక్కిస్తున్నారు. సమంత, శర్వానంద్ ప్రధాన పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కింది.

దాదాపుగా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ కం లోగోను రిలీజ్ చేశారు. ఈ సినిమాకి గాను జాను అనే టైటిల్ ని ఖరారు చేశారు. సింపుల్ గా సినిమాకి సంబంధించిన లుక్ ని బయటకు రిలీజ్ చేశారు. అయితే ఈ పోస్టర్ లో హీరో శర్వానంద్ ఒంటెలను ఫోటో తీస్తున్నట్టుగా కనిపిస్తున్నాడు. అయితే ఈ పోస్టర్ ని గమనిస్తే ఈ సినిమాలో శర్వానంద్ వైల్డ్‌ లైఫ్‌ ఫోటోగ్రాఫర్‌గా కనిపిస్తున్నాడని తెలుస్తోంది.

ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సమంత లుక్ ని మాత్రం రిలీజ్ చేయకపోవడం ఆమె అభిమానులకి కొంచం నిరాశను కలిగించిందనే చెప్పాలి. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తుండగా ఒరిజినల్ వర్షన్‌ కి దర్శకత్వం వహించిన సి. ప్రేమ్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. గోవింద వసంత సంగీతమందిస్తున్నాడు. ఈ సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని జనవరి 7 న రిలీజ్ చేస్తున్నారు. ఇక సినిమా కథ విషయానికి వచ్చే సరికి స్కూల్ డేస్‌లో ప్రేమలో పడ్డ హీరో, హీరోయిన్లు ఇద్దరు ఆ తర్వాత కొన్ని కారణాలతో విడిపోవాల్సి వస్తుంది. ఇలా జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుస్తారు. అప్పుడు వీరిద్దరి మధ్య ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అన్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

పెళ్లి అయిన తర్వాత సమంత పాత్రకి ప్రాధాన్యత ఉన్న పాత్రలనే ఎంచుకుంటూ వస్తుంది. అందులో భాగంగానే యూ టర్న్ , మజిలి, ఓ బేబీ సినిమాలు వచ్చాయి. ఈ సినిమానే కాకుండా మరో రెండు సినిమాలు చేస్తుంది సమంత..

ఇక శర్వానంద్ విషయానికి వచ్చేసరికి గత ఏడాది రణరంగం సినిమాతో నిరాశపరిచిన శర్వానంద్ ఈ సినిమాపైన ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమానే కాకుండా ఈ సంవత్సరం కీరవాణి, శ్రీకారం అనే సినిమాలు రిలీజ్ చేసే పనిలో ఉన్నాడు శర్వానంద్.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories