దానికెంతో ధైర్యం కావాలి : సమంత

దానికెంతో ధైర్యం కావాలి : సమంత
x
Highlights

సమంత..చిన్మయి.. వీరిద్దరి స్నేహం గురించి చెప్పక్కర్లేదు. తెర మీద ప్రేక్షకుల్ని పలకరించే సమంత కు తీయని గొంతు ఇచ్చేది చిన్మయినే. అయితే, ఇటీవలి కాలంలో...

సమంత..చిన్మయి.. వీరిద్దరి స్నేహం గురించి చెప్పక్కర్లేదు. తెర మీద ప్రేక్షకుల్ని పలకరించే సమంత కు తీయని గొంతు ఇచ్చేది చిన్మయినే. అయితే, ఇటీవలి కాలంలో చిన్మయి చిక్కుల్లో పడింది. విదేశాల్లో ప్రారంభమైన మీటూ ఉద్యమం ప్రేరణతో.. మీటూ అంటూ చిన్మయి ప్రముఖ సాహిత్య రచయిత వైరముత్తు వేధింపుల గురించి బయట పెట్టింది. ఈ సమయంలో సమంత చిన్మయికి అండగా స్పందించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ 'చిన్మయికి సపోర్ట్‌ చేసినందుకు గర్వపడుతున్నాను. 'మీటూ' ఉద్యమం విదేశాల్లో ప్రారంభమైంది. అక్కడ మహిళలు ఒకరికొకరు అండగా ఉన్నారు. ఇలాంటి నిజాలు బయటపెట్టడానికి ఎంతో ధైర్యం కావాలి. ఇప్పుడు చిన్మయి ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఎటువంటి తప్పు చేయని ఓ వ్యక్తి ఇలాంటి సమస్యలు ఎదుర్కోకూడదు. ఆమెకు అంతా మంచే జరగాలని ఆశిస్తున్నా. ఇప్పటికీ తమిళనాడు డబ్బింగ్‌ యూనియన్‌కు వ్యతిరేకంగా పోరాడుతోంది. నేను, నందిని రెడ్డి కలిసి చిన్మయితో 'ఓ బేబీ' తమిళ్‌ డబ్బింగ్‌ చెప్పించాం' అని అన్నారు.

డబ్బింగ్‌ యూనియన్‌ అధ్యక్షుడు రాధారవిపై 'మీటూ' ఆరోపణలు చేసిన తర్వాత చిన్మయిని ఆ యూనియన్‌ నుంచి తొలగించారు. సభ్యత్వాన్ని రెన్యువల్‌ చేసుకోలేదనే కారణం చెప్పారు. తిరిగి సభ్యత్వం ఇవ్వాలంటే కొన్ని షరతులు పెట్టారు. రాధారవికి క్షమాపణలు చెప్పాలని కూడా డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో చిన్మయి కోర్టును ఆశ్రయించారు. దీంతో న్యాయస్థానం ఆమెను నిషేధించడంపై తాత్కాలిక స్టే విధించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories