బాలీవుడ్‌కు ఇస్మార్ట్ శంకర్.... అక్కడ ఇస్మార్ట్ ఎవరంటే..?

బాలీవుడ్‌కు ఇస్మార్ట్ శంకర్.... అక్కడ ఇస్మార్ట్ ఎవరంటే..?
x
Highlights

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ హీరో రామ్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ఇస్మార్ట్ శంకర్.. నిధి అగర్వాల్, నభా నటేష్ హియర్ హీరోయిన్స్ గా నటించారు....

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ హీరో రామ్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ఇస్మార్ట్ శంకర్.. నిధి అగర్వాల్, నభా నటేష్ హియర్ హీరోయిన్స్ గా నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. ఈ సినిమా ఉహించిన దానికంటే భారీ హిట్టును సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాని బాలీవుడ్ లో కూడా రీమేక్ చేసేందుకు కొందరు బడా నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే సినిమాకి సంబంధించిన రీమేక్ హక్కులను ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ సొంతం చేసుకున్నట్లు సమాచారం..

అయితే ఈ సినిమాలో హీరోగా రణ్‌వీర్‌ సింగ్‌ నటించేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమాని అక్కడ ఏ దర్శకుడు దర్శకత్వం వహిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. దీనిపైన మరికొన్ని రోజుల్లో స్పష్టత రానుంది. ఇక ఇప్పటికే ఇస్మార్ట్ శంకర్ సినిమాకి సిక్వేల్ ఉంటుందని పూరి ప్రకటించాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఫైటర్ అనే సినిమా చేస్తున్నాడు. ప్రీ ప్రొడక్షన్ పనులో బిజీ ఉన్నాడు పూరి .. ఈ సినిమా అనంతరం ఇస్మార్ట్ కి సీక్వెల్ తెరకేక్కే ఛాన్స్ ఉంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories