షాకింగ్ లుక్‌లో హీరో రామ్ పోతినేని..

షాకింగ్ లుక్‌లో హీరో రామ్ పోతినేని..
x
Highlights

చాలా కాలంగా నుండి మంచీ హిట్‌ కోసం ఎదురుచూస్తున్న యంగ్ హీరో రామ్ పోతినేని ఇస్మార్‌ శంకర్‌తో సూపర్‌ డూపర్ హిట్ కొట్టాడు. డ్యాషింగ్ డైరెక్టర్ పూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ శంకర్ ఇప్పటి వరకు రూ.75 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టి సత్తా చాటింది.

చాలా కాలంగా నుండి మంచీ హిట్‌ కోసం ఎదురుచూస్తున్న యంగ్ హీరో రామ్ పోతినేని ఇస్మార్‌ శంకర్‌తో సూపర్‌ డూపర్ హిట్ కొట్టాడు. డ్యాషింగ్ డైరెక్టర్ పూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ శంకర్ ఇప్పటి వరకు రూ.75 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టి సత్తా చాటింది. అయితే ప్రస్తుతం ఇస్మార్‌ శంకర్‌ సక్సెస్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్న రామ్‌ తన డిఫరెంట్ లుక్‌లో షాక్‌ ఇచ్చాడు. ఏంటాహ షాక్ అని అనుకుంటున్నారా? అదే పైన ఉన్న ఫోటోలో కనిపిస్తున్నాడుగా.. గుండు కొట్టించుకున్నాడు. ఔనా అనుకోవద్దు. ఔను. నిజంగానే గుండు కొట్టించుకున్న ఫోటోలు రామ్ ట్వీట్టర్ పొస్టు చేశాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో భారీ గడ్డం, డిఫరెంట్ హెయిర్ స్టైల్‌తో రామ్ లుక్ అదరగొట్టాడు.

పక్క హైదరాబాదీ మాస్ ఎలా ఉంటారో అచ్చం అలానే చూపించాడు రామ్. ఇప్పుడేమో గుండు గెటప్‌లో కనిపించాడు. ఓ వైపు గుండు, మరోవైపు ఫ్రెంచ్ గడ్డంతో కొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు. మరి రామ్‌ ఎందుకు గుండు చేయించుకున్నాడు..? ఏదైనా కొత్త సినిమా కమిట్ అయ్యాడా లేకా.. సరదాగా ట్రై చేశాడా అని నెటిజన్లు తీవ్రంగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అభిమానులు మాత్రం కొత్తం సినిమా కోసమే మా హీరో కొత్త లుక్ అని తెగ సంబరపడిపోతున్నారు. మొత్తానికి రామ్ కొత్త లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories