వెంకీమామకి ఉన్నది వారం రోజులే..ఈ లోపు లాగేస్తాడా?

వెంకీమామకి ఉన్నది వారం రోజులే..ఈ లోపు లాగేస్తాడా?
x
Highlights

విక్టరీ వెంకటేష్‌, యువ సామ్రాట్‌ నాగచైతన్య హీరోలుగా తెరకెక్కిన మల్టీ స్టారర్ మూవీ వెంకీ మామ.

విక్టరీ వెంకటేష్‌, యువ సామ్రాట్‌ నాగచైతన్య హీరోలుగా తెరకెక్కిన మల్టీ స్టారర్ మూవీ వెంకీ మామ. బాబీ (కేయస్‌ రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో వెంకటేష్‌కు జోడిగా పాయల్‌ రాజ్‌పుత్‌, నాగచైతన్యకు జోడిగా రాశీఖన్నాలు నటించారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు తమన్‌ సంగీతమందించాడు. రియల్‌ లైఫ్‌ మామా అల్లుళ్లు రీల్‌ లైఫ్‌లోనూ మామా అల్లుళ్లుగా నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ క్రేజ్‌ ఏర్పడింది. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది.

అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 33 కోట్ల వరకు జరిగిందని టాక్. మొదటి రోజు విడుదలైన అన్ని దియేటర్లో దాదాపుగా హౌస్ ఫుల్ అయిపోయాయి. యుఎస్ లో కూడా తొలిరోజు మంచి కలెక్షన్లను సాధించిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. వారి అంచనా ప్రకారం మొదటి రోజు దాదాపుగా 10 కోట్ల వరకు వసూలు చేసిందని తెలుస్తోంది. ఇక వారంతంరంలో కూడా ఇదే రకంగా సినిమా నడిస్తే మరో 20 కోట్లు సోమవారానికి రాబట్ట వచ్చు నని అంచనా.. మిగిలిన రోజులలో మరో 10 కోట్లు సాధించడం కష్టం కాదని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అందులోనూ సినిమా దాదాపుగా హిట్టు టాక్ సాధించడంతో వెంకీ మామ అల్లుడుతో కలిసి లాభాలను మొదటివారం లోనే లాగేస్తాడని భావిస్తున్నారు.

ఈ మొదటివారం టెన్షన్ లెక్కలు ఎందుకంటే వచ్చే శుక్రవారం ఏకంగా నాలుగుసినిమాలు విడుదలవుతున్నాయి. అందులో మూడు తెలుగు సినిమాలు కాగా, ఓ హిందీ సినిమా ఉంది. ఇకే మూడు తెలుగు సినిమాలు వేటికవే భారీ అంచనాలతో విడుదలవుతున్నాయి. వాటిలో బాలయ్య బాబు నటించిన రూలర్ సినిమా మొదటిది. ఈ సినిమాపై నందమూరి అభిమానులు భారీ ఆశలు పెట్టకున్నారు. బాలయ్య బాబు సరికొత్త లుక్ లో ఇప్పటికే తెలుగు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. దీనితో ఈ సినిమా బాక్సాఫీసు వద్ద రికార్డులు సృష్టించడం ఖాయమని అబిమానుల అంచనా.

ఇక పోతే మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ బాక్సాఫీసు వద్ద ప్రతిరొజూ పండగ చేస్తానంటూ అదే రోజు రాబోతున్నాడు. రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా మారుతి దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమా ట్రైలర్ తో ఇంటిల్లిపాదినీ ఆకట్టుకునే సినిమా అవుతుందని అంచనాలు ఏర్పడ్డాయి.

ముచ్చటగా మూడోవాడిగా కార్తీ దొంగ సినిమాతో వెండితెరను పలకరించనున్నాడు. ఇప్పటికే 'ఖైది' మెగా టైటిల్ తో విజయాన్ని అందుకొని అదే ఉపులో మరో మెగా టైటిల్ తీసుకొని టాలీవుడ్ బాక్సాఫీసు మీదా ఈ శుక్రవారమే దండెత్తనున్నాడు.

ఈ ముగ్గురి మధ్యలో సూపర్ హిట్టు హిందీ సినిమా దబాంగ్ సిరీస్ లో మూడో సినిమా దబాంగ్ 3 ప్రేక్షకులను పలకరిచనుంది. ఇలా భారీ అంచనాల ఉన్న నాలుగు సినిమాలు ఒకేరోజు విడుదల అవుతుండడంతో వెంకీమామకి కాస్తా అడ్డు తలిగే అవకాశం ఉంది. అందుకే ఈ లోపులోనే కలెక్షన్లను కొల్లగొట్టి లాభాల భాటలో పడడం అవసరం. అందుకే వెంకీమామ కి మొదటివారమే పరీక్షగా మారింది. అయితే సినిమా మంచి టాక్ ని మూటగట్టుకోవడంతో కలెక్షన్లను సాధించడం పెద్ద కష్టంగా కనిపిచడం లేదని టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories