RRR రిలీజ్ డేట్ మరోసారి మారబోతుందా?

RRR రిలీజ్ డేట్ మరోసారి మారబోతుందా?
x
Highlights

బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్ ( వర్కింగ్ టైటిల్ మాత్రమే )..

బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్ ( వర్కింగ్ టైటిల్ మాత్రమే ).. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇక ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు.

మొదటగా ఈ సినిమాని ఈ సినిమాని జులై 30 న రిలీజ్ చేస్తున్నట్టుగా చిత్ర బృందం ముందుగా ప్రకటించినప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌కి టైం సరిపోకపోవడంతో 2021 జనవరి 8న రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ రిలీజ్ డేట్ కూడా మారేలాగా కనిపిస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం కరోనా ప్రభావం వలన ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ పడింది. పరిస్థితులు చక్కబడితే తప్ప సినిమా షూటింగ్ మొదలయ్యే ఛాన్స్ లేదు. ఈ నేపధ్యంలో సినిమా రిలీజ్ డేట్ మరోసారి వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది.

దాదాపుగా 80 శాతం షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్‌ లతో పాటు హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగన్, సముద్రఖని,శ్రియ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇక బాహుబలి లాంటి సినిమా తర్వాత రాజమౌళి నుంచి సినిమా వస్తుండడం, ఎన్టీఆర్ , రామ్ చరణ్ కలిసి నటిస్తుండడంతో సినిమాపైన మంచి అంచనాలు నెలకొన్నాయి. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. విజయేంద్రప్రసాద్ కథని అందించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories