సమంత కొత్త 'కర్తవ్యం'?

సమంత కొత్త కర్తవ్యం?
x
Highlights

సమంత ఇపుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఈ పేరే మారుమోగుతోంది. వరుస విజయాలు.. అదీ హీరోయిన్ ప్రాధాన్యతా సినిమాలు. యు టర్న్, సూపర్‌ డీలక్స్, మజిలీ..తాజాగా...

సమంత ఇపుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఈ పేరే మారుమోగుతోంది. వరుస విజయాలు.. అదీ హీరోయిన్ ప్రాధాన్యతా సినిమాలు. యు టర్న్, సూపర్‌ డీలక్స్, మజిలీ..తాజాగా 'ఓ బేబీ' ఇవి కాకుండా మహానటి, రంగస్థలం.. వైవిధ్యమైన పాత్రలు అంతకు మించి ప్రతి పాత్రలోనూ ఒదిగిపోతున్న సమంత. ఇక ఇప్పుడు ఓ బేబీ సినిమాతో మరింత ఎత్తుకు ఎదిగిపోయింది. దీంతో హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలకి సమంత తప్ప ఎవరూ లేరనే పరిస్థితి వచ్చేసింది. ఇపుడు చాలా మంది దర్శక-నిర్మాతలు ఆమెను హీరోయిన్ గా పెట్టె సినిమాలు తీయడానికి ప్రయత్నాలు మొదలు పెట్టేశారు. అందులో ప్రముఖంగా వినిపిస్తున్నది తమిళ ఆరమ్ - తెలుగులో కర్తవ్యం దర్శకుడు గోపీ నాయర్. ఈయన సమంత తో సినిమా కోసం రెడీ అయ్యారని వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ సినిమా కొత్త కథా? లేకపోతే కర్తవ్యం సినిమాకి సీక్వేలా అనేది ఇంకా తేలలేదు. అన్నట్టు కర్తవ్యం సినిమా హీరోయిన్ నయనతార. మరి సీక్వెల్ కోసం సమంత కోసం ప్రయత్నిస్తున్నారన్న వార్త కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories