రాజు గారు మీ జడ్జిమెంట్ చెక్ చేసుకోండి.. !

రాజు గారు మీ జడ్జిమెంట్ చెక్ చేసుకోండి.. !
x
Highlights

తెలుగు సినిమా ఇండస్ట్రీలో దిల్ రాజ్ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కి మంచి గుర్తింపు ఉంది. ఇండస్ట్రీలో చాలా సినిమాల సక్సెస్ రేట్ కూడా ఆయనకే...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో దిల్ రాజ్ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కి మంచి గుర్తింపు ఉంది. ఇండస్ట్రీలో చాలా సినిమాల సక్సెస్ రేట్ కూడా ఆయనకే ఉన్నాయి. సినిమాల మీదా ఆయనకి మంచి జడ్జిమెంట్ ఉందని అందరు అంటూ అంటారు . కానీ ఈ మధ్య అయన చెప్తున్నది ఒకటి అయ్యేది మరొకటి లాగా కనిపిస్తుంది . నితిన్ హీరోగా రాశి ఖన్నా హీరోయిన్ గా తెరకెక్కిన శ్రీనివాస కళ్యాణం సినిమా విషయంలో తెలుగులో వరకు ఇంత వరకు రాని గొప్ప కుటుంబ కథ చిత్రం చూడబోతున్నారు అని ఓ రేంజ్ లో హైప్ ఇచ్చారు. కట్ చేస్తే నితిన్ ఫ్యాన్స్ తలుచుకోవడానికి కూడా భయపడే అంతలా డిజాస్టర్ గా మిగిలింది.

ఇక ఇలాంటి ఎఫెక్ట్ లవర్ సినిమా విషయంలోనూ జరిగింది . అసలు అ సినిమా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో ఎవరికీ తెలియదు . మహర్షి సినిమా విషయంలోని రాజు గారు అదే మాట అన్నారు . మహేష్ బాబు ఫాన్స్ మీరు ఎంతైనా ఉహించుకోండి సినిమా ఎక్కడ కూడా తగ్గదు అన్నారు . ఫైనల్ గా సినిమా విడుదలైన తరవాత పబ్లిక్ టాక్ తో పాటు సినిమా రివ్యూస్ కూడా యునానిమస్ గా లేకపోవడం అభిమానులను కొంత ఆందోళనకు గురి చేస్తోంది.

ఇక సోషల్ మీడియా లో కూడా సినిమాపై ఆశించిన స్థాయిలో స్పందన లేదు . మెసేజ్ ఇవ్వడానికి తీసుకున్న కధ బాగానే ఉంది కానీ మహేష్ గత చిత్రాలను మరోసారి చూసినట్టే ఉంది కానీ కొత్తదనం ఎక్కడ కూడా లేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి . ఏది ఏమైనా దిల్ రాజు గారు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో చెప్పినంత గొప్పగా సినిమా లేదనేది మాత్రం ఒప్పుకోవలిసిన మాటే ..

Show Full Article
Print Article
Next Story
More Stories