దొరసాని.. యువతని టార్గెట్ చేసిందా?

దొరసాని.. యువతని టార్గెట్ చేసిందా?
x
Highlights

ఉద్యమం లో చావు కూడా విజయమే.. నా ప్రేమ కూడా ఓ ఉద్యమమే! ఇదీ దొరసాని తాజా ట్రైలర్ లో ఓ డైలాగ్. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, రాజశేఖర్, జీవితల...

ఉద్యమం లో చావు కూడా విజయమే.. నా ప్రేమ కూడా ఓ ఉద్యమమే! ఇదీ దొరసాని తాజా ట్రైలర్ లో ఓ డైలాగ్. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, రాజశేఖర్, జీవితల కూతురు శివాత్మిక లను పరిచయం చేస్తూ కేవీఆర్ మహేంద్ర దర్శకత్వంలో రూపు దిద్దుకుంటోంది దొరసాని.

కూలి వాని కొడుకు.. దొరబిడ్డ తో ప్రేమలో పడటం.. దానిని అందరూ వద్దని వారించడం..పోలీసులు.. కథానాయకుడు కటకటాల్లో ఉండటం.. ఇలా సినిమా కథని దాదాపుగా పరిచయం చేస్తూ ట్రైలర్ ని మలిచారు. ఈ ట్రైలర్ లో డైలాగులు.. కట్ చేసిన సీన్ లు చూస్తుంటే సినిమా పూర్తిగా యువతరం కోసమే చేసినట్టు కనిపిస్తోంది. ఆనంద్ దేవరకొండ వాయిస్ విజయ్ వాయిస్ లానే ఉండడడం ఆసక్తిగా అనిపిస్తోంది.

ఈ సినిమా ఈ నెల 12 న థియేటర్లలోకి రానుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories