రానా, తేజ సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్

రానా, తేజ సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్
x
Highlights

బాహుబలి సినిమా తర్వాత హీరో రానా ఇమేజ్ మరింతగా పెరిగింది. కానీ గత కొద్దిరోజులుగా సినిమాలకి దూరంగా ఉన్న రానా ఇప్పుడు వరుసగా సినిమాలు చేసేందుకు సిద్దం అయ్యాడు.

బాహుబలి సినిమా తర్వాత హీరో రానా ఇమేజ్ మరింతగా పెరిగింది. కానీ గత కొద్దిరోజులుగా సినిమాలకి దూరంగా ఉన్న రానా ఇప్పుడు వరుసగా సినిమాలు చేసేందుకు సిద్దం అయ్యాడు. ఇప్పటికే రానా హీరోగా విరాటపర్వం అనే సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో రానా సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకి వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో సాయి పల్లవి ఓ నక్సలైట్ పాత్రలో కనిపించనుందని సమాచారం

ఇక ఈ సినిమాతో పాటు ఎప్పటినుంచో అనుకుంటున్న హిరణ్య కశ్యప సినిమా కూడా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా సొంత బ్యానర్ సురేష్ ప్రొడక్షన్స్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఫాన్ ఇండియా మూవీగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. గతంలో గుణశేఖర్ దర్శకత్వంలో రుద్రమదేవి అనే సినిమాని చేశాడు రానా..

ఇప్పుడు ఈ రెండు సినిమాలతో పాటు దర్శకుడు తేజ దర్శకత్వంలో ఓ సినిమాని చేసేందుకు సిద్దం అయ్యాడు రానా.. ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ అయిపోయి త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది. 'రాక్షస రాజ్యంలో రావణాసురుడు' అనే టైటిల్ ని ఫిక్స్ చేశారని, ఈ సినిమాలో రానా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రను చేయనున్నాడని సమాచారం. ఈ సినిమాని కూడా సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెలువడనున్నాయి. గతంలో తేజ, రానా కాంబినేషన్ లో వచ్చిన నేనే రాజు నేనే మంత్రి సినిమా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories