అన్నయ్యను 'ఒరేయ్‌', 'ఏరా' అలా పిలవడం ఇబ్బందిగా అనిపించింది : నాగబాబు

అన్నయ్యను ఒరేయ్‌, ఏరా అలా పిలవడం ఇబ్బందిగా అనిపించింది : నాగబాబు
x
Highlights

మెగాస్టార్ కి తమ్ముడుగా, పవర్ స్టార్ కి అన్నయ్యగా ముఖ్యంగా ఓ మంచి ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. నాగబాబు.. అంజనా ప్రొడక్షన్స్ పై గతంలో...

మెగాస్టార్ కి తమ్ముడుగా, పవర్ స్టార్ కి అన్నయ్యగా ముఖ్యంగా ఓ మంచి ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. నాగబాబు.. అంజనా ప్రొడక్షన్స్ పై గతంలో చిరంజీవితో పలు సినిమాలను నిర్మించారు నాగబాబు. ప్రస్తుతం జబర్దస్త్ షో కి జడ్జిగా వ్యవహరిస్తున్నారు. నాగబాబు చిరంజీవితో సినిమాలను నిర్మించడమే కాదు కొన్ని సినిమాల్లో నటించారు కూడా.. అందులో భాగంగానే కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఆంజీ సినిమాలో చిరంజీవిని పెంచి పోషించిన పెద్దయ్య పాత్రలో నాగబాబు నటించారు..

అయితే పాత్రలోని సన్నివేశాల్లో నాగబాబు చిరంజీవిని 'ఒరేయ్‌', 'ఏరా' అని పిలవాల్సి వస్తుంది. కానీ దీనికి నాగబాబు ముందుగా అంగీకరించలేదట.. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ చిరంజీవి వద్దకు తీసుకెళ్లారట. దీనితో చిరంజీవి ప్రత్యేకంగా నాగబాబుతో మాట్లాడి. మనం చేస్తున్నది కేవలం పాత్రలు మాత్రమే కాబట్టి తప్పదు పిలవు అని చెప్పారట.. దీనితో అప్పడు నాగబాబు ఒప్పుకున్నారట.. ఈ విషయాన్ని నాగబాబు ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.. ఈరోజు నాగబాబు పుట్టినరోజు జరుపుకుంటున్నారు..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories