సరిలేరులో ఆ సీన్ హైలెట్

సరిలేరులో ఆ సీన్ హైలెట్
x
Sarileru neekevvaru
Highlights

కామెడీని పండిచడంలో అనిల్ రావిపూడి దిట్ట..దానితో పాటు యాక్షన్ ఎపిసోడ్ కూడా అద్భుతంగా ఉంటుంది. గతంలో చేసిన అయన చేసిన నాలుగు సినిమాలు కూడా అదే తరహాలో...

కామెడీని పండిచడంలో అనిల్ రావిపూడి దిట్ట..దానితో పాటు యాక్షన్ ఎపిసోడ్ కూడా అద్భుతంగా ఉంటుంది. గతంలో చేసిన అయన చేసిన నాలుగు సినిమాలు కూడా అదే తరహాలో తెరకెక్కి మంచి విజయాన్ని అందుకున్నాయి. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా సరిలేరు నీకెవ్వరు అనే సినిమాని తెరకేక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రేస్టింగ్ న్యూస్ ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది.

ఈ సినిమాలో 39 నిమషాల ట్రయిన్ సీన్ ఉండనుందట.. ఈ ఎపిసోడ్ సినిమాకి బిగ్గెస్ట్ హైలెట్ గా నిలవనుందని తెలుస్తుంది. ఈ ట్రయిన్ ఎపిసోడ్ లో జబర్దస్త్ నటులతో పాటు బండ్ల గణేష్ కూడా ఉండనున్నాడట.. ఇప్పటికే ఈ సీన్ ని అనిల్ చాలా అద్భుతంగా తెరకెక్కించాడని, సినిమాకి ఈ సీన్ బాగా ప్లస్ అవుతుందని చెబుతున్నారు.

దిల్ రాజు, అనిల్ సుంకరలతో కలిసి మహేష్ బాబు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో మహేష్ కి జోడిగా రష్మిక మందన్నా నటిస్తుంది. విజయశాంతి ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తుంది. ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్, రావు రమేష్, సంగీత ముఖ్యపాత్రలలో కనిపించనున్నారు.

ఈ సినిమాలో తమన్నా ఐటెం సాంగ్ చేస్తుందని సమాచారం. ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 11 న రిలీజ్ చేయనున్నారు. సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ని వచ్చే నెల జనవరి 5 న హైదరాబాద్ లో నిర్వహించనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories