logo

రాహుల్ సిప్లిగంజ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..

Rahul SipligunjRahul Sipligunj
Highlights

అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 3 కి రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలిచినా సంగతి...

అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 3 కి రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలిచినా సంగతి తెలిసిందే.. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదా రాహుల్ బిగ్ బాస్ ప్రైజ్ మనీని అందుకున్నాడు. దీనితో రాహుల్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అయితే సాధారణ వ్యక్తిగా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన రాహుల్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం..

1) రాహుల్ 1989, ఆగస్టు 22న హైదరాబాదులోని ధూల్ పేటలో జన్మించాడు. లయోల హైస్కూల్ లో ఉన్నత విద్యను, నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్, డిగ్రీ విద్యను పూర్తిచేశాడు.

2) చిన్నప్పటి నుండి పాటలపై ఉన్న ఇష్టంతో సొంతంగా సాధన చేసేవాడు. వంటగదిలోని వస్తువులతో సంగీతం వాయిస్తూ పాటలు పాడడం గమనించిన రాహుల్ తండ్రి, పండిత్ విఠల్ రావు దగ్గరికి పంపించి సంగీతం నేర్పించాడు.

4) రాహుల్ ఓ ప్లే బ్యాక్ సింగర్ గా తన కెరియర్ ని మొదలు పెట్టాడు. కొన్ని ఫోక్ సాంగ్స్ కూడా పాడాడు. యుట్యూబ్ లో ఆల్బమ్స్ చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు.

5) రాహుల్ మొదటగా 2009 లో అక్కినేని నాగచైతన్య హీరోగా వచ్చిన జోష్ సినిమాలో పాట పాడి టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు.

6) ఆ తరువాత దమ్ము సినిమాలో దమ్ము, వాస్తు బాగుందే, రచ్చ సినిమాలో సింగరేణి ఉంది, ఛల్ మోహన రంగా సినిమాలో పెద్దపులి వంటి పాటలతో మంచి గుర్తింపు పొందాడు. ఇక 2018 లో వచ్చిన రంగస్థలం సినిమాలో రాహుల్ పాడిన రంగ రంగ రంగస్థలానా పాటకు అత్యంత ప్రజాదరణ లభించింది. కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలోని ఏ మెలికెల్ పాటలో స్పానిష్ భాగాన్ని పాడాడు.ఇక ఇస్మార్ట్ శంకర్ సినిమాలో బోనాలు సాంగ్ బాగా క్లిక్ అయింది.

7) ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండీ బిగ్ బాస్ షో లోకి అడుగుపెట్టి తనని తానూ ప్రూవ్ చేసుకుంటూ అభిమానుల మనసు గెలుచుకొని బిగ్ బాస్ త్రీ కి విన్నర్ గా గెలిచాడు. యాబై లక్షల ప్రైజ్ మనీని గెలుచుకున్నాడు. అనంతరం రాహుల్ మాట్లాడుతూ "' బిగ్ బాస్3' విన్నర్ అయితే సెలూన్ షాప్ పెట్టుకుంటానని చెప్పాడు. అది అతని కులవృత్తి అని ఎంత స్థాయికి ఎదిగినప్పటికీ దానిని మరచిపోనని రాహుల్ చెప్పుకొచ్చాడు.









లైవ్ టీవి


Share it
Top