Pawan Kalyan: వకీల్ సాబ్ కి హీరోయిన్ దొరికేసినట్టే !

Pawan Kalyan: వకీల్ సాబ్ కి హీరోయిన్ దొరికేసినట్టే  !
x
vakeel saab
Highlights

రాజకీయల కోసం రెండేళ్ళు దూరంగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.. బాలీవుడ్ హిట్ చిత్రం పింక్

రాజకీయల కోసం రెండేళ్ళు దూరంగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.. బాలీవుడ్ హిట్ చిత్రం పింక్ రీమేక్ గా పవన్ 'వకీల్ సాబ్' తెరకెక్కుతుంది. ఇది పవన్ కి 26 వ చిత్రం.. హిందీలో వచ్చిన పింక్ సినిమాకి ఇది రీమేక్ ..ఇందులో అంజలి, నివేతా థామస్, అనన్య పాండే హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకి ఓ మై ఫ్రెండ్ ఫేం వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా, బోనీ క‌పూర్‌, దిల్ రాజుకలిసి సంయుక్తంగా సినిమాని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు..ప్రస్తుతం శేరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాని మే 15న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తాజాగా రిలీజ్ చేసిన సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, ఫస్ట్ సాంగ్ కి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపైన భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారు అన్న సందేహాలు ఎప్పటినుంచో నెలకొన్నాయి. సినిమాలో పవన్ కళ్యాణ్ లాయర్ గా కనిపించనున్న సంగతి తెలిసిందే..ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వచ్చే స్టొరీలో పవన్ వైఫ్ గా శృతిహసన్ కనిపించనుందని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా శృతిహసన్ కి బదులుగా గోవా బ్యూటీ ఇలియానా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే హరీష్ శంకర్-పవన్ కాంబోలో త్వరలో తెరకేక్కబోతున్న చిత్రంలో శృతిహాసన్ ఫైనల్ కావడంతో గోవా బ్యూటీనే హీరోయిన్ గా తీసుకునే ఛాన్స్ ఉంది. గతంలో పవన్ కళ్యాణ్ , ఇలియానా కలిసి జల్సా అనే సినిమాలో నటించారు..

ఇక వకీల్ సాబ్ సినిమా తరవాత పవన్ వరుసపెట్టి సినిమాలు చేసేందుకు సిద్దం అయ్యారు. ఇప్పటికే క్రిష్ డైరెక్షన్లో ఓ సినిమాని పవన్ లైన్ లో పెట్టారు. ప్రస్తుతం ఈ సినిమా కూడా శేరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఎఎం రత్నం ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక దీని తర్వాత పవన్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇక పూరి, త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాలు చేసేందుకు పవన్ సిద్దం అయ్యారని తెలుస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories