Mahesh Babu: ఒక్కరోజు మహేష్ బాబు రాష్ట్రానికి సీఎం అయితే ?

Mahesh Babu: ఒక్కరోజు మహేష్ బాబు రాష్ట్రానికి సీఎం అయితే ?
x
Highlights

మహేష్ బాబు ఏంటి? రాష్ట్రానికి సీఎం ఏంటి అనే కదా మీ అనుమానం! అసలు మహేష్ బాబుకి రాజకీయాలకి ఎలాంటి సంబంధం లేదు.

మహేష్ బాబు ఏంటి? రాష్ట్రానికి సీఎం ఏంటి అనే కదా మీ అనుమానం! అసలు మహేష్ బాబుకి రాజకీయాలకి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయం మహేష్ బాబు చాలా విషయాల్లో స్పష్టం చేశారు కూడా.. మరి ఈ ప్రశ్న ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే? మహేష్ బాబుని ఓ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్న ఇది.. దానికి మహేష్ బాబు సమాధానం ఇస్తూ... "నేను ఒక్కరోజు రాష్ట్రానికి సీఎం అయితే ఆరోజున రాష్ట్రాన్ని ఆ దేవుడే కాపాడాలి.. నేను ఎం చేస్తానో నాకే తెలియదని" సమాధానం ఇచ్చారు మహేష్..

మహేష్ బాబు రాజకీయాల్లోకి వస్తున్నారని అప్పట్లో రకరకాల వార్తలు వచ్చాయి. కానీ అవేమి నిజం కాలేదు. దీనిపైన మహేష్ పలుమార్లు స్పందించారు కూడా.. నా జీవితం సినిమాలకే అంకితమని, రాజకీయాల్లోకి వచ్చే ఛాన్స్ లేదని మహేష్ చెప్పుకొచ్చారు. ఇక దీనిపైన అయన భార్య నమ్రత కూడా స్పందిస్తూ.. మహేష్ నాతోనే సరిగ్గా మాట్లాడారు ఒక స్టేజ్ పైకి ఎక్కి ఎం మాట్లాడుతాడు అంటూ సమాధానం ఇచ్చింది. గతంలో మహేష్ 'భరత్ అను నేను' సినిమాలో రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నటించారు.

ఇక తాజాగా సరిలేరు నీకెవ్వరు సినిమాతో సంక్రాంతి బరిలో నిలిచి పెద్ద విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం మహేష్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటిస్తున్నాడు. గ్యాంగ్ స్టర్ నేపధ్యంలో ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది! గతంలో వీరి కాంబినేషన్ లో మహర్షి లాంటి బ్లాక్ బస్టర్ మూవీ వచ్చింది. మళ్ళీ ఇదే కాంబినేషన్ రీపేట్ అవుతుండడంతో సినిమాపైన భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో కీయరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. దిల్ రాజు నిర్మిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories