రివ్యూ: ఇద్దరి లోకం ఒకటే

రివ్యూ: ఇద్దరి లోకం ఒకటే
x
Highlights

హీరో రాజ్ తరుణ్ కి ముందుగా చేసిన సినిమాలు మంచి సక్సెస్ ని అందించాయి.

హీరో రాజ్ తరుణ్ కి ముందుగా చేసిన సినిమాలు మంచి సక్సెస్ ని అందించాయి. కానీ ఆ తర్వాత ఆ సక్సెస్ ని కాపాడుకోవడంలో రాజ్ తరుణ్ పూర్తిగా విఫలం అయ్యాడు. ఇప్పుడు ఇద్దరం లోకం ఒకటే అని ఓ విభిన్నమెన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శాలిని పాండే హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా లవ్ లైక్స్ కో ఇన్సిడెన్స్ స్ అనే సినిమాకి రీమేక్ .. కథ, దర్శకుడి మీద నమ్మకంతో స్టార్ ప్రొడ్యూసర్‌ దిల్ రాజు ఈ సినిమాని నిర్మించడంతో సినిమాకి మంచి బజ్ ఏర్పడింది. దీనితో ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా అయిన రాజ్ తరుణ్ కి ఓ హిట్టును అందించిందా లేదా అన్నది మన సమీక్షలో చూద్దాం .

కథ:

ఇక కథ విషయానికి వస్తే మహి (రాజ్‌ తరుణ్‌), వర్ష (షాలిని పాండే) ఇద్దరు చిన్నప్పటి స్నేహితులు. 18 సంవత్సరాల తర్వాత వీరిద్దరూ అనుకోకుండా కలుస్తారు. తన తాతకిచ్చిన మాట కోసం ఎప్పటికైన నటిగా ప్రూవ్‌ చేసుకోవాలని హీరోయిన్‌ అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తుంటుంది వర్ష . ఈ క్రమంలో మహితో పరిచయం అవ్వడం జరగడం, ఈ ప్రయాణంలో వర్ష, మహి దగ్గరవుతారు. కానీ అప్పటికే వర్ష రాహుల్ తో పెళ్లికి రెడీ అయిపోతుంది. ఇలాంటి పరిణామాల మధ్య మహికి ఓ సంఘటన ఎదురవుతుంది. ఈ విషయం తెలుసుకున్న వర్ష ఎం చేసింది. ఇంతకి వీరిద్దరూ ఒక్కటి అయ్యార లేదా అన్నది తెరపైన చూడాలి.

ఎలా ఉందంటే ?

ఈ సినిమాకి కథ, కథనాలు ప్రధానం కాదు. రెండు పాత్రలు మాత్రేమే కీలకం. ఆ ఇద్దరి మధ్య ఉండే సున్నితమైన ప్రేమ కథను చాలా చక్కగా ఆవిష్కరించాడు దర్శకుడు. ఎమోషన్ సీన్స్ తో బాగా ఆకట్టుకున్నాడు. రీమేక్ సినిమా అయినప్పటికీ ఎక్కడ కూడా అలాంటి ఛాయలు అయితే కనిపించవు. ఎలాంటి హంగులు, అర్భాటలకి పోకుండా సినిమాని చాలా చక్కగా నడిపించాడు. మొదటి భాగం సో సో గా సాగినప్పటికీ ఇక రెండవ భాగం ఎం జరగబోతుంది అన్న ఆసక్తిని అయితే కలిగించింది. చెపే పాయింట్ మరింత పొయటిక్‌గా చెప్పే ప్రయత్నంలో కథనాన్ని నెమ్మదిగా నడిపించిన భావన కలుగుతుంది. మధ్య మద్యలో వచ్చే పాటలు కూడా బాగున్నాయి. ఇక పతాక సన్నివేశాలు అంతగా ఆకట్టుకోవు.

నటీనటులు:

ఇక ఎప్పటిలిలాగే రాజ్‌ తరుణ్‌ ఈ సినిమాలో కూడా తన మార్క్ చూపించాడు. సెటిల్డ్‌ పర్మాఫెన్స్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఇక అర్జున్‌ రెడ్డి సినిమా తరువాత షాలిని పాండే మరోసారి బెస్ట్ పర్ఫామెన్స్‌తో ఆకట్టుకుంది. లవ్‌, ఎమోషన్స్‌ సన్నివేశాలలో అద్భుతంగా నటించింది. ఇక రోహిణి, భరత్‌ నాజర్‌ తదితరులు పాత్రల మేరకు ఒకే అనిపించారు.

సాంకేతికవర్గం:

ఇక సాంకేతిక వర్గం విషయానికి వస్తే.. సినిమాకు ప్రధాన బలం సమీర్ రెడ్డి అందించిన సినిమాటోగ్రఫి అని చెప్పాలి. విజువల్ గా ఆకట్టుకున్నాడు. ఊటీ అందాలను చాలా చక్కగా తన కెమెరాలో బంధించాడు. ఇక మిక్కీ జే మేయర్‌ సంగీతం పర్వాలేదని అనిపిస్తుంది. ఎడిటింగ్‌ విషయంలో ఇంకాస్త దృష్టి పెడితే బాగుండు అనిపిస్తుంది. సినిమాలో చాలా సన్నివేశాలు ల్యాగ్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక దిల్‌ రాజు నిర్మాణ విలువలు సినిమా స్థాయిని పెంచాయి.

చివరగా: మనసుకు హత్తుకునే ప్రేమకథ

Show Full Article
Print Article
More On
Next Story
More Stories