logo

నేను బాగానే ఉన్నాను!

నేను బాగానే ఉన్నాను!

మెగా హీరో వరుణ్ తేజ్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైందన్న వార్తలతో మెగా అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయితే, ఈ ప్రమాదంలో తనకు ఎలాంటి గాయాలు తగల్లెదనీ, క్షేమంగానే ఉన్నాననీ,వరుణ్ తేజ్ తెలిపారు. ఈ మేరకు అయన ట్వీట్ చేశారు.

"నేను ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు. అందరం సేఫే. ఇలాంటి సమయంలో మీరు నాపై చూపిస్తున్న శ్రద్ధకు, ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను" అంటూ తన ట్వీట్ లో పేర్కొన్నారు వరుణ్ తేజ్.

వరుణ్ తేజ్ షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ నుంచి బెంగుళూర్ వెళుతుండగా వనపర్తి జిల్లా కొత్తకోట వద్ద ప్రమాదం జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న మెర్సిడజ్ బెంజ్ కారును మరో కారు డీ కొట్టింది. ఈ ఘటనలో వరుణ్ తేజ్ కారు ముక్న్డు భాగంలో ఓ వైపు పూర్తిగా దెబ్బతింది.

లైవ్ టీవి

Share it
Top