Top
logo

రాంగోపాల్ వర్మకు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసుల నోటీసులు

రాంగోపాల్ వర్మకు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసుల నోటీసులు
X
RGV
Highlights

రాంగోపాల్ వర్మకు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసుల నోటీసులు జారీ చేశారు. రేపు సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట హాజరు...

రాంగోపాల్ వర్మకు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసుల నోటీసులు జారీ చేశారు. రేపు సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట హాజరు కావాలని ఆదేశించారు. కేఏ పాల్ ఫిర్యాదు మేరకు వర్మపై కేసు నమోదైంది. అమ్మరాజ్యంలో కడప బిడ్డలు సినిమాపై కేఏ పాల్ ఫిర్యాదు చేశారు. తన ఫోటోలు, వీడియోలు మార్పింగ్ చేశారని ఫిర్యాదులో కేఏ పాల్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే వీళ్ళ ముందు హాజరు కాబోతున్నాడు వర్మ. మరోవైపు తాను కూడా కేఏ పాల్‌పై పరువునష్టం దావా వేస్తానని చెబుతున్నాడు ఆర్జీవీ.

ఇక ఆ‎మ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా విషయానికి వచ్చే సరికి సినిమా మొదలు నుండే చాలా వివాదాలను సృష్టిస్తూ వచ్చింది ఈ సినిమా. టైటిల్ నుంచి, ట్రైలర్ వరకు అన్ని వివదాస్పదంగా మారాయి. భారీ అంచనాల నడుమ ఈ సినిమా డిసెంబర్ 12 ప్రే‌‍‍క్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ప్రే‌‍‍క్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. చిత్రానికి టాక్ నెగిటివ్ రావడంతో కలెక్షన్లు పడిపోయాయి.

Web TitleHyderabad cyber crime police notices to Ram gopal Varma
Next Story