స్టార్ హీరో తండ్రికి క్యాన్సర్‌

hrithik roshan
x
hrithik roshan
Highlights

బాలీవుడ్ సూపర్‌ హీరో హృతిక్‌ రోషన్‌ అభిమానులకు షాక్‌ ఇచ్చారు. ఈ రోజు ఉదయం తండ్రి రాకేష్‌ రోషన్‌తో కలిసి జిమ్‌లో దిగిన ఫోటోను తన సోషల్‌ మీడియా పేజ్‌లో షేర్‌ చేసిన హృతిక్‌ తన తండ్రి క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టుగా వెల్లడించారు.

బాలీవుడ్ సూపర్‌ హీరో హృతిక్‌ రోషన్‌ అభిమానులకు షాక్‌ ఇచ్చారు. ఈ రోజు ఉదయం తండ్రి రాకేష్‌ రోషన్‌తో కలిసి జిమ్‌లో దిగిన ఫోటోను తన సోషల్‌ మీడియా పేజ్‌లో షేర్‌ చేసిన హృతిక్‌ తన తండ్రి క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టుగా వెల్లడించారు."ఈ ఉదయం మా నాన్నతో ఓ ఫోటో తీసుకోవాలని ఉందని అడిగాను. సర్జరీ జరిగే రోజు కూడా ఆయన వ్యాయామం మానలేదు. మా నాన్న చాలా బలమైన వారు. కొద్ది వారాల క్రితం ఆయన గొంతు క్యాన్సర్ తో బాధపడుతున్నట్టు తెలిసింది. ఇది ప్రారంభ దశలోనే ఉంది. క్యాన్సర్ పై యుద్ధం చేయడానికి ఆయన బయలుదేరారు. ఆయన వంటి తండ్రి దొరకడం నాకెంతో అదృష్టం. మా కుటుంబానికి కూడా - లవ్ యూ డాడ్" అని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories