అడ్రస్ చెప్పండి ప్లీజ్... ట్విటర్‌లో హృతిక్ రిక్వెస్ట్

అడ్రస్ చెప్పండి ప్లీజ్... ట్విటర్‌లో హృతిక్ రిక్వెస్ట్
x
హృతిక్‌ రోషన్‌
Highlights

ప్రపంచంలో ఎంతో మంది ప్రఖ్యాతి గాంచిన డాన్సర్స్ ఉన్నారు. వారిలో కేవలం కొంత మంది మాత్రమే అభిమానుల మనసు దోచుకున్నారు.

ప్రపంచంలో ఎంతో మంది ప్రఖ్యాతి గాంచిన డాన్సర్స్ ఉన్నారు. వారిలో కేవలం కొంత మంది మాత్రమే అభిమానుల మనసు దోచుకున్నారు. ఇలా అందిరి అభిమానాన్ని దోచుకున్న టాప్ డాన్సర్స్ లో మిఖాయిల్ బారిష్నికోవ్, మైఖేల్ జాక్సన్, మడోన్నా, షకీరా, హృతిక్ రోషన్, మార్తా గ్రాహం, ప్రభుదేవా ఉన్నారు. వీళ్లు డాన్స్ చేసిన ఒక్కో పాట చూస్తే చాలు వావ్ అంటూ ముక్కున వేలేసుకోక తప్పదు. అసలు వీళ్ల ఒంట్లో ఎముకలు ఉన్నాయా లేవా అంటూ అందరూ ఆశ్చర్యపోతారు.

ఇక ఇందులో ముఖ్యంగా బాలీవుడ్‌ గ్రీక్‌ గాడ్‌గా పేరున్న హృతిక్‌ డ్యాన్స్ అంటే చాలు ఫ్యాన్స్ ఫిదా అయిపోతారు. అలాంటి హీరోనే ఫిదా చేసాడు ఓ యువకుడు. ఒక టిక్‌టాక్‌ వీడియో తీసి ట్విటర్‌లో తన అభిమాన హీరో హృతిక్‌ను ట్యాగ్‌ చేస్తూ పోస్టు చేశాడు. అంతే ఇంకేముంది ఆ వీడియో చూసిన హృతిక్‌ టిక్‌ టాక్‌ వీడియోకు ఫిదా అయిపోయాడు. అసలు అంతలా హృతిక్ కూడా ఆ వీడియోకి ఆకర్షితుడయ్యాడంటే ఏం చేసి ఉంటాడు అనుకుంటున్నారా.. ఇప్పుడు తెలుసుకుందాం.

హృతిక్‌ రోషన్‌ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి నేటికి ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. దీంతో ఓ ఫ్యాన్ తన అభిమానాన్ని చాటుకున్నాడు. తాను డాన్స్ చేస్తూ ఓ వీడియోని చిత్రీకరించి దాన్ని హృతిక్‌ను ట్యాగ్‌ చేస్తూ పోస్టు చేశాడు. ఆ వీడియో చూసిన హీరో 'నేను చూసిన గొప్ప స్మూతెస్ట్‌ ఎయిర్‌ వాకర్‌... ఎవరితను..?' అంటూ స్వయంగా తన ఖాతా నుంచి ఆ అభిమాని పెట్టిన పోస్టును షేర్‌ చేశారు. "ఎవరీ కుర్రాడు అడ్రన్‌ చెప్పండి అని అభిమానులను అడిగేంతగా ఫిదా అయ్యాడు.

వరుస షూటింగ్ లతో బిజీగా ఉండే హృతిక్‌ స్వయంగా ఆ వీడియోని షేర్ చేస్తూ అతని అడ్రస్ చెప్పండి అని అడగడం ట్విటర్‌ వేదికగా వైరల్‌ అయింది. ఇక ఈ వీడియోని బాలివుడ్ గ్రీక్‌ గాడ్‌ షేర్ చేయడంతో డ్యాన్స్‌ చేసిన కుర్రాడిని నెటిజన్లు కూడా తెగ పొగిడేస్తున్నారు. ఇంత బిజీ లైఫ్ లో కూడా అభిమాని షేర్ చేసిన వీడియోని హృతిక్ చూసి తిరిగి షేర్‌ చేయడంతో అభిమానులు తెగ ఆనందిస్తున్నారు. ఈ వీడియోను చూసిన బాలీవుడ్‌ మెగాస్టార్‌, బిగ్ బీ అమితాబ్‌ సైతం ప్రశంసల వర్షం కురిపించాడు. ఇక ఈ వీడియో ఇప్పుడు నెటిజన్ల ఫోన్లలో హల్ చల్ చేస్తోంది. మీరు కూడా వావ్ అనిపించే ఈ డాన్స్ వీడియోని చూడండి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories