ఆ స్టార్ హీరో అప్పడాలు అమ్ముకుంటున్నాడు!

ఆ స్టార్ హీరో అప్పడాలు అమ్ముకుంటున్నాడు!
x
Highlights

స్టార్ హీరోలు డీ గ్లామర్ క్యారెక్టర్లు చేయడం చాలా తక్కువ. బాలీవుడ్ లో అయితే అసలు చేయరనే చెప్పొచ్చు. సినిమాలో ఎక్కడైనా ఓ సారి అటువంటి మేకప్ లో...

స్టార్ హీరోలు డీ గ్లామర్ క్యారెక్టర్లు చేయడం చాలా తక్కువ. బాలీవుడ్ లో అయితే అసలు చేయరనే చెప్పొచ్చు. సినిమాలో ఎక్కడైనా ఓ సారి అటువంటి మేకప్ లో కనిపించాల్సి వస్తే ఓకే అంటారు కానీ, మొత్తం డీ గ్లామర్ గా కనిపించాలంటే వెనకడుగు వేస్తారు. అయితే, ఇపుడిపుడే ఆ పరిస్థితులు మారుతున్నాయి. రియ‌లిస్టిక్ పాత్రల్లో కూడా క‌నిపించేందుకు ఇటీవ‌లి కాలంలో స్టార్ హీరోలు కూడా సిద్ధప‌డుతున్నారు. డీ గ్లామ‌ర్ క్యారెక్టర్ లో కష్టప‌డి న‌టించి పాత్రకు జీవం పోస్తున్నారు.

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఇటీవల అటువంటి ఓ సినిమా చేస్తున్నాడు. గణిత శాస్త్రవేత్త ఆనంద్ జీవిత క‌థ ఆధారంగా వికాస్‌ భల్‌ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న `సూప‌ర్ 30` సినిమాలో హృతిక్ న‌టిస్తున్నాడు. ఎక్కడో మారుమూల ఊళ్లో పుట్టి, ఎన్నో క‌ష్టాలు ప‌డి గ‌ణిత శాస్త్రవేత్తగా ఎద‌గ‌డం, ఐఐటీలో విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం, జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించడం వంటి అంశాల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆయ‌న జీవితంలో ఎంతో క‌ష్టం ఉంద‌ని తెలియ‌జేస్తూ తాజాగా హృతిక్ ఓ ట్వీట్ చేశాడు. `ఆనంద్‌ జీవిత ప్రయాణంలో అప్పడాలు అమ్ముకునే ఘట్టం చాలా కీల‌కం. ఆ సమయంలో ఆయన పడిన భావోద్వేగమే.. తరువాత ఆయ‌న సాధించిన విజయాలకు కారణమైంద` ని హృతిక్‌ ట్వీట్‌ చేశాడు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories