HIT మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్

HIT మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్
x
Hit movie first day collections
Highlights

ఈ నగరానికి ఏమైంది సినిమాతో నటుడుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరో విశ్వక్ సేన్ ఆ తర్వాత 'ఫలక్‌నుమా దాస్‌' సినిమాతో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు....

ఈ నగరానికి ఏమైంది సినిమాతో నటుడుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరో విశ్వక్ సేన్ ఆ తర్వాత 'ఫలక్‌నుమా దాస్‌' సినిమాతో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. తాజాగా హిట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హీరో నాని ఈ సినిమాని నిర్మించగా, డాక్టర్ శైలేష్ కొలను ఈ సినిమాని తెరకెక్కించాడు. ఇందులో చి.ల. సౌ ఫేం రుహానీ శర్మ హీరోయిన్‌గా నటించింది.. సినిమా ముందుకు రిలీజ్ అయిన పాటలు, టీజర్, ట్రైలర్స్ ఆకట్టుకోవడంతో సినిమాపైన మంచి అంచనాలు పెరిగాయి. దీనితో సినిమాపైన మంచి అంచనాలు పెరిగాయి..

అయితే సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమాకి ఏపీ, తెలంగాణాలో కలిపి 1.4 కోట్ల షేర్ వసూలు చేసిందని తెలుస్తోంది. శనివారం, ఆదివారం వసూళ్లు మెరుగయ్యే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇప్పటికే నాని నిర్మాతగా మంచి సక్సెస్ అయ్యాడు. 'అ' అనే చిత్రాన్ని నిర్మించి మంచి విజయాన్ని అందుకున్న నాని తన రెండో ప్రయత్నంగా హిట్ మూవీని తెరకెక్కించాడు.

నైజాం : 67L

సీడెడ్ : 13L

ఉత్తరాంద్ర : 12L

ఈస్ట్ గోదావరి : 7L

పశ్చిమ గోదావరి : 6L

గుంటూరు : 15.6L(8L hires)

కృష్ణ : 8L

నెల్లూరు : 3.5L

ఏపీ, తెలంగాణాలో :- 1.32CR

ఈ సినిమాకి సుమారుగా 4.4 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం క్లీన్ హిట్ గా నిలవాలి అంటే.. 4.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

ఇక హీరోగా కూడా నాని ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో 'v' అనే సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాలో నానితో పాటు సుధీర్ బాబు హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన చిత్ర టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఉగాది సందర్భంగా సినిమాని రిలీజ్ చేయనున్నారు.సినిమాపైన భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాతో పాటు టక్ జగదీశ్ అనే సినిమాలో కూడా నాని నటిస్తున్నాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories