Top
logo

హిందీ అర్జున్ రెడ్డి కలెక్షన్ల సునామీ!

హిందీ అర్జున్ రెడ్డి కలెక్షన్ల సునామీ!
Highlights

టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన అర్జున్ రెడ్డి బాలీవుడ్ లోనూ దుమ్ము దులిపేస్తున్నాడు. కబీర్ సింగ్ పేరుతో...

టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన అర్జున్ రెడ్డి బాలీవుడ్ లోనూ దుమ్ము దులిపేస్తున్నాడు. కబీర్ సింగ్ పేరుతో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.. షాహిద్ కపూర్ హీరోగా అర్జున్ రెడ్డిని హిందీలోకి రీమేక్ చేశారు. ఈ సినిమా రెడ్ను రోజుల క్రితం హిందీలో విడుదలైంది. రెండు రోజుల్లోనే 43 కోట్లు వసూలు చేసి వంద కోట్ల దిశగా దూసుకుపోతోంది. షాహిద్ కపూర్ సినిమాలకు ఓపెనింగ్ పదికోట్లు రావడం కష్టంగా ఉండేది. అటువంటిది కబీర్ సింగ్ సినిమా 20 కోట్లకు పైగా ఓపెనింగ్స్ సాధించింది. ఇక రెండో రోజూ జోరు తగ్గకుండా మరో 20 కోట్లకు పైగా తన ఖాతాలో వేసుకుని.. కాస్త అటూ ఇటూ గా రెండురోజుల్లో 43 కోట్లు సాధించి షాహిద్ కపూర్ సినిమాల్లో సరికొత్త రికార్డును సృష్టించింది ఈ సినిమా.

Next Story


లైవ్ టీవి