ఆ సినిమా చూసి నాగబాబు ఫోన్ చేసి మెచ్చుకున్నారు : రాశి

ఆ సినిమా చూసి నాగబాబు ఫోన్ చేసి మెచ్చుకున్నారు : రాశి
x
Highlights

బాలనటిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది రాశి.. ఆ తర్వాత హీరోయిన్ అయి పవన్ కళ్యాణ్ , జగపతి బాబు, శ్రీకాంత్ , రాజేంద్రప్రసాద్ , మోహన్ బాబు లాంటి స్టార్...

బాలనటిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది రాశి.. ఆ తర్వాత హీరోయిన్ అయి పవన్ కళ్యాణ్ , జగపతి బాబు, శ్రీకాంత్ , రాజేంద్రప్రసాద్ , మోహన్ బాబు లాంటి స్టార్ హీరోస్ తో కలిసి నటించింది. ఆ తరవాత పెళ్లి చేసుకొని సినిమాలకి దూరంగా ఉన్న రాశి మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఓ ప్రముఖ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన రాశి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది.

అందులో భాగంగా భీమనేని శ్రీనివాస్ రావు దర్శకత్వంలో వచ్చిన శుభాకాంక్షలు సినిమాతో రాశి తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ సినిమాతోనే తన పేరును విజయ నుండి రాశిగా మారిందని చెప్పుకొచ్చింది. ఇక దర్శకుడు తేజ దర్శకత్వంలో వచ్చిన నిజం సినిమా గురించి మాట్లాడుతూ ముందుగా ఆ కథలోని తన పాత్రను చాలా పాజిటివ్ గా చెప్పిన తేజ తీరా సినిమాలో నెగటివ్ గా చూపించారని చెప్పుకొచ్చింది రాశి.

ఆ సినిమా చేస్తున్న మొదటి రోజే నాకు అర్ధం అయిందని, కాకపోతే అప్పటికే సినిమాకి అడ్వాన్సు తీసుకోవడం,మళ్ళీ సినిమా షూటింగ్ మధ్యలో వెళ్ళిన బ్యాడ్ నేమ్ నాకు ఎందుకు అని అనిపించి ఆ సినిమాని పూర్తి చేసనని చెప్పుకొచ్చింది రాశి. ఇక ఆ సినిమా చూసిన నాగబాబు ఫోన్ చేసి మాట్లాడారని ,సినిమా ఎలా ఉన్నా స్క్రీన్ పైన బాగున్నావ్ అని చెప్పాడని చెప్పింది రాశి.. ఇక కొందరు అభిమానులు ఆ సినిమాలోని ఆ పాత్ర బాగుందని ,మరికొందరు మాత్రం మీరు బాగా చేసారని చెప్పారని రాశి చెప్పింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories