మురగదాస్ తో అ సినిమా చేసి తప్పు చేశా : నయనతార

మురగదాస్ తో అ సినిమా చేసి తప్పు చేశా : నయనతార
x
Highlights

నయనతార ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్ .. తమిళ్ ,తెలుగు ఇలా పలు భాషల్లో నటించి గొప్ప హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది . అయితే నయన్ కి అ పేరు ఉరికే రాలేదు...

నయనతార ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్ .. తమిళ్ ,తెలుగు ఇలా పలు భాషల్లో నటించి గొప్ప హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది . అయితే నయన్ కి అ పేరు ఉరికే రాలేదు కదా ..! సినిమా అవకాశాల కోసం చిన్న చితక సినిమాలు చేసుకుంటూ వచ్చింది . నయనతారకు ఇటు తెలుగు లొను అటు తమిళ్ లోను మంచి పేరు తీసుకొచ్చిన సినిమా గజని .ఈ సినిమా దాదాపు అన్నీ ముఖ్య భాషల్లో నిర్మితమై..అన్ని చోట్ల పెద్ద హిట్‌గా నిలిచింది. ఎ ఆర్ మురగదాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.

అయితే ఈ సినిమా గురించి నయనతార మాట్లాడుతూ.. తన కెరీర్‌లో 'గజినీ' సినిమా చేయడమే ఓ చెత్త నిర్ణయం అని పేర్కోంది. ఈ సినిమాలో నయనతార సెకండ్ హీరోయిన్‌గా నటించింన సంగతి తెలిసిందే ..అయితే మొదట దర్శకుడు నయన్‌కు ఈ కథ చెప్పినప్పుడు తన పాత్ర గురించి, దాని ప్రవర్తన, పాత్ర నిడివి ఒకలా చెప్పి.. చివరకు సినిమా విడుదల తర్వాత..తన పాత్రను మరోలా చూపించారని పేర్కోంది.

అయితే ఆ సినిమా మంచి అనుభవం లాంటిదని..ఆ తర్వాత నుండి తాను చేయబోయే పాత్రలు, వాటి ఎంపికలో చాలా జాగ్రత్త పడ్డానని చెప్పింది. నయనతార రజనీకాంత్ హీరోగా వచ్చిన 'చంద్రముఖి' సినిమా గురించి కూడా మాట్లాడింది. ఆ సినిమా గురించి మాట్లాడుతూ..'చంద్రముఖి' సినిమాలో తాను చిన్న పాత్రే చేసినప్పటికీ, తనను చాలా మంచిగా చూపించారని.. ఆ సినిమా తనకు మంచి పేరు తీసుకొచ్చిందని తెలిపింది నయనతార.

అంతా బాగానే ఉందికాని అప్పుడెప్పుడో వచ్చినా గజినీ సినిమా గురించి ఇప్పుడు నయన్ మాట్లడడం ఆసక్తి సంతరించుకుంది . ఇప్పుడు దీనిపై ఎలాంటి వివాదం ఏర్పడుతుందో అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు . ముఖ్యంగా దీనిపైన డైరెక్టర్ మురగదాస్ ఎలా స్పందిస్తాడో చూడాలి మరి .

Show Full Article
Print Article
Next Story
More Stories