హీరో విశాల్‌కు తీవ్ర గాయాలు?

హీరో విశాల్‌కు తీవ్ర గాయాలు?
x
Highlights

దక్షిణ భారత నటీనటుల సంఘం ప్రధాన కార్యదర్శి, తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు, హీరో విశాల్‌ తీవ్రంగా గాయపడ్డారు. సుందర్‌.సి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ...

దక్షిణ భారత నటీనటుల సంఘం ప్రధాన కార్యదర్శి, తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు, హీరో విశాల్‌ తీవ్రంగా గాయపడ్డారు. సుందర్‌.సి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ చిత్రం ప్రస్తుతం టర్కీలో షూటింగ్‌ జరుగుతోంది. అయితే షూటింగ్‌లో ఫైట్‌ సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొన్న ఆయన ప్రమాదవశాత్తు

తీవ్రంగా గాయపడినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ ఘటనలో విశాల్‌ కాలు, చేయి విరిగినట్లు తెలుస్తోంది. కాలు, చేతికి బ్యాండేజ్‌తో ఉన్న విశాల్‌ ఫోటో బయటకు విడుదల అయింది. మరోవైపు ఈ ఫోటోపై విశాల్ ఎలాంటి ప్రకటనా చేయలేదు. షూటింగ్ కోసం ఇలా కట్లు కట్టారా? లేక నిజంగానే ప్రమాదం జరిగిందా అనే విషయం బయటకు రావాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories