Top
logo

ఎంట్రీ ప్రీ... లోకేషన్ చూసుకొని వచ్చేయండి .. !

ఎంట్రీ ప్రీ... లోకేషన్ చూసుకొని వచ్చేయండి .. !
Highlights

విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం డియర్ కామ్రేడ్ ..ఈ సినిమాకి భరత్ కమ్మ దర్శకుడు .. ఈ సినిమాని మొత్తం...

విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం డియర్ కామ్రేడ్ ..ఈ సినిమాకి భరత్ కమ్మ దర్శకుడు .. ఈ సినిమాని మొత్తం నాలుగు భాషల్లో విడుదల చేస్తున్నారు . అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని విడుదల చేసింది చిత్ర బృందం.. అయితే ఈ సినిమా విడుదల సమయం దగ్గర పడుతుండడంతో సినిమా ప్రొమోషన్ ని వినూత్న రీతిలో చేయనుంది చిత్ర యూనిట్ .. మొత్తం ఐదు రాష్ట్రాల్లో ఈ సినిమా ప్రచారాన్ని చేయనున్నారు ..

అయితే ఈ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ సినిమాకోసం సంవత్సరం పాటు కష్టపడ్డాము. ఇప్పుడు సినిమాని ఎంజాయ్ చేద్దామని ఫిక్స్ అయ్యాము . అందులో భాగంగానే డియర్ కామ్రేడ్ మ్యూజిక్ ఫెస్టివల్ కి ప్లాన్ చేస్తున్నాం ఇందులో అందరికి ఉచ్చితంగా ప్రవేశం ఉంటుందని మీ లొకేషన్ చూసుకొని రావాలని విజయ్ అన్నారు . రేపు బెంగుళూరులో జరిగే మ్యూజికల్ ఫెస్టివల్ కి హీరో యాష్ వస్తున్నారని విజయ్ పేర్కొన్నారు ..

Next Story