శివ సార్.. మా ఇంట్లో ఇంక పిల్లల్లానే ట్రీట్ చేస్తున్నారు : విజయ్ దేవరకొండ

శివ సార్.. మా ఇంట్లో ఇంక పిల్లల్లానే ట్రీట్ చేస్తున్నారు : విజయ్ దేవరకొండ
x
Vijay devarakonda, koratala Siva
Highlights

ప్రస్తుతం టాలీవుడ్ లో "బీ ది రియ‌ల్ మ్యాన్" అనే ఛాలెంజ్‌ నడుస్తున్న సంగతి తెలిసిందే.. అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగ మొదలుపెట్టిన ఈ ఛాలెంజ్‌ కి మంచి రెస్పాన్స్ వస్తుంది.

ప్రస్తుతం టాలీవుడ్ లో "బీ ది రియ‌ల్ మ్యాన్" అనే ఛాలెంజ్‌ నడుస్తున్న సంగతి తెలిసిందే.. అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగ మొదలుపెట్టిన ఈ ఛాలెంజ్‌ కి మంచి రెస్పాన్స్ వస్తుంది.ఇక ఆ తర్వాత రాజమౌళి నుంచి జూనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ నుంచి కొరటాల, కొరటాల శివ నుంచి విజయ్ దేవరకొండ వరకు చేరింది. అయితే కొరటాల ఛాలెంజ్‌ పై విజయ్ దేవరకొండ స్పందించాడు. శివ స‌ర్‌, మా మ‌మ్మీ న‌న్ను పని చేయ‌నివ్వట్లేదు. నేను చేస్తే ప‌ని డబుల్ అవుతుంద‌ని అంటుంద‌ని విజ‌య్ పేర్కొన్నాడు.

మ‌మ్మల్ని రియ‌ల్ మ్యాన్‌లా చూడ‌ట్లేదు. ఇంట్లో ఇంక పిల్లల్లానే ట్రీట్ చేస్తున్నారు. అయినప్పటికీ లాక్‌డౌన్ స‌మ‌యంలో నా డే ఎలా గ‌డుస్తుందో తెలియ‌డం కోసం చిన్న వీడియో షేర్ చేస్తాను అని విజ‌య్ ట్వీట్ చేసాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఫైటర్ అనే సినిమాని చేస్తున్నాడు. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. పూరి, చార్మీ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం కరోనా ప్రాభవంతో సినిమా వాయిదా పడింది. సినిమాపైన మంచి అంచనాలు నెలకొన్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories