నాన్న మీరుంటే బాగుండు .. వెంకీ ఎమోషనల్ పోస్ట్

నాన్న మీరుంటే బాగుండు .. వెంకీ ఎమోషనల్ పోస్ట్
x
Venkatesh
Highlights

విక్టరీ వెంకటేష్ , అక్కినేని నాగచైతన్య కలిసి నటించిన చిత్రం వెంకీ మామ. ఈ రోజు విడుదలైన ఈ సినిమా విడుదలై

విక్టరీ వెంకటేష్ , అక్కినేని నాగచైతన్య కలిసి నటించిన చిత్రం వెంకీ మామ. ఈ రోజు విడుదలైన ఈ సినిమా విడుదలైన అన్ని కేంద్రాలలో మంచి టాక్ ని సంపాదించుకుంటుంది. ఈ రోజు వెంకటేష్ పుట్టిన రోజు కావడం, మరోవైపు వెంకీమామ మంచి హిట్టు కొట్టడంతో వెంకీకి డబుల్‌ ధమాకా దక్కినట్టయైంది. ఈ నేపధ్యంలో వెంకటేష్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. తన తండ్రి, నిర్మాత దగ్గుబాటి రామానాయుడిని తలుచుకుంటూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు.

ఈ సంతోషంలో నువ్వు వుంటే బావుండేది నాన్నా అంటూ తన తండ్రిని గుర్తు చేస్తున్నారు. 'మిస్‌ యూ నాన్న' అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. వెంకీమామ ఇప్పుడు మీ అందరిదీ. దగ్గరలోని థియేటర్‌కు వెళ్లి చూడండి. దయచేసి పైరసీని ప్రోత్సహించకండి అని వెంకటేశ్‌ సూచించారు. అలాగే చైతూతో చిన్నప్పుడు దిగిన ఫోటోను, వెంకీమామ చిత్రంలోని స్టిల్‌ని పోస్ట్ చేశారు.

ఇక వెంకీమామ కథ పరంగా రోటిన్‌గా అనిపించినప్పటికీ దర్శకుడు బాబీ స్క్రీన్‌ప్లేను ఆసక్తికరంగా తెరకెక్కించాడు. ఇందులో వెంకటేష్ సరసన పాయల్ రాజ్ పుత్ నటించగా, నాగ చైతన్య సరసన రాశీఖన్నా నటించింది. తమన్ సంగీతం అందించాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, సురేష్ ప్రొడక్షన్స్ కలిసి సినిమాని నిర్మించాయి.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories