అల .... డబ్బింగ్ మొదలైంది..!

ala vaikunthapuramulo
x
ala vaikunthapuramulo
Highlights

అల్లు అర్జున్ , త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం అల వైకుంఠపురములో.. పూజా హేగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. సంక్రాంతి పండగకు గాను ఈ...

అల్లు అర్జున్ , త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం అల వైకుంఠపురములో.. పూజా హేగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. సంక్రాంతి పండగకు గాను ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. అయితే అప్పుడే చిత్ర యూనిట్ డబ్బింగ్ కూడా మొదలు పెట్టింది. అందులో భాగంగా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్న హీరో సుశాంత్ తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్న పిక్ ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.


Instagramలోని ఈ పోస్ట్‌ని వీక్షించండి

And here goes dubbing for #AlaVaikunthapurramuloo ! 😊 Where we focus on sound rather than the visuals 🎧🎤

Sushanth A (@iamsushanth) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది


ఇందులో సుశాంత్ కీలకపాత్రలో నటిస్తున్నాడని సమాచారం. ఈ పాత్ర తన కెరియర్ కి టర్నింగ్ పాయింట్ అవుతుందని సుశాంత్ భావిస్తున్నాడు. నవదీప్, రావు రమేష్ , మురళీ శర్మ ముఖ్యపాత్రలో కనిపిస్తున్నారు. ఇక అలనాటి తార టబు ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తుంది. గీతా ఆర్ట్స్, హారిక హాసిని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. బన్ని, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఇది మూడవ చిత్రం కాబట్టి సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories