అన్నమయ్య చూసి నా కాళ్ళకి దండం పెట్టారు : సుమన్

అన్నమయ్య చూసి  నా కాళ్ళకి దండం పెట్టారు : సుమన్
x
Highlights

యాక్షన్, ఫ్యామిలీ సినిమాలో హీరోగా నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో సుమన్ .. తెలుగు, తమిళ, కన్నడ భాషలలో దాదాపుగా 150కి పైగా సినిమాలలో...

యాక్షన్, ఫ్యామిలీ సినిమాలో హీరోగా నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో సుమన్ .. తెలుగు, తమిళ, కన్నడ భాషలలో దాదాపుగా 150కి పైగా సినిమాలలో నటించాడు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న సుమన్ తాజాగా ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో భాగంగా తన కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాలుగా నిలిచిన అన్నమయ్య, శ్రీరామదాసు సినిమాల గురించి చెప్పుకొచ్చారు సుమన్..

"ఈ సినిమా కోసం దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుగారు ఒకరోజు మా ఇంటికి వచ్చి సినిమా కథని, అందులో నా పాత్ర గురించి చెప్పారు. నేను వెంటంనే జోక్ చేస్తున్నారా నేను దేవుడి ఏంటి అని అడిగగా, ఆ పాత్ర మీరే చేయాలని అన్నారు. ఆ తర్వాత ఆ పాత్రని చేసేందుకు కొంచం సమయం తీసుకొని ఇంట్లో వాళ్ళని అడిగాను. వాళ్ళు కూడా ఒకే అన్నారు. అలా ఓ రోజు రాత్రి కలలో నాకు తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయం కనిపించింది. దీంతో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాను. అయితే ఇప్పటి వరకు మీసం లేకుండా ఎప్పుడూ నటించలేదు. ఎలా ఉంటానోనని అనుకున్నా. మీసంతో గెటవ్‌ వేసుకుని చూసుకున్నా పర్వాలేదనిపించింది. ఈ సినిమాకి మేకప్ వేసుకోడానికి దాదాపు నాలుగు గంటలు పట్టేది. ఉదయం 4 గంటలకు అన్నపూర్ణా స్టూడియోన్‌కు వెళితే, కిరీటం పెట్టుకుని సెట్‌లోకి వచ్చే సరికి ఉదయం ఎనమిది గంటలు అయ్యేది. ఇలా 8 నెలల పాటు ఆ మేకప్‌ వేసుకోని ఆ సినిమాని చేశాను.

ఈ సినిమా చేస్తున్నన్ని రోజులు మాంసాహారం మానేశా. ఫ్యామిలీ జీవితానికి దూరంగా ఉండేవాడిని. నేలమీద పడుకునేవాడిని. ఇక సినిమా విడుదలయ్యాక సినిమాలోని నా పాత్రకి మంచి పేరు వచ్చింది. సినిమా చేసిన తర్వాత చాలా మంది వచ్చి నా కాళ్లకు నమస్కారం చేసేవారు. నా జీవితంలో అలాంటిది ఊహించలేదు. ఇది నాకు దేవుడు ఇచ్చిన ఓ వరం అని అనుకుంటాను. ఇక అప్పటి భారత రాష్ట్రపతి శంకర్‌దయాళ్‌ శర్మగారు రాష్ట్రపతి భవన్‌కు ప్రింట్‌ తెప్పించుకుని నన్ను పక్కన కూర్చొబెట్టుకుని మరీ చూశారు. ఇక ఈ సినిమా తర్వాత శ్రీరామదాసు సినిమాలో కూడా రాముడిగా చాలా మందిని అనుకోని చివరికి నన్ను సంప్రదించారు. అలా రాముడిగా కూడా కనిపించాను " అని సుమన్ చెప్పుకొచ్చారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories