మెగాస్టార్ బయోపిక్ కి ఆ హీరోనే కరెక్ట్ : సాయి ధరమ్ తేజ్

మెగాస్టార్ బయోపిక్ కి ఆ హీరోనే  కరెక్ట్ : సాయి ధరమ్ తేజ్
x
మెగాస్టార్ చిరంజీవి, సాయి ధరమ్ తేజ్
Highlights

ప్రస్తుతం ఇండియన్ సినిమాల్లో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తుంది. సినీ, రాజకీయనాయకులపై, క్రీడాకారులపై బయోపిక్ లు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఇండియన్ సినిమాల్లో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తుంది. సినీ, రాజకీయనాయకులపై, క్రీడాకారులపై బయోపిక్ లు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. అందులో భాగంగానే మహానటి, ఎన్టీఆర్, యాత్ర లాంటి బయోపిక్ లు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాయి. అయితే గత కొద్ది రోజులుగా మెగాస్టార్ బయోపిక్ పై రకరకాల వార్తలు వస్తున్నాయి.

సైరా మూవీ ప్రమోషన్ లో భాగంగా చిరు కూడా ఈ బయోపిక్ పైన స్పందించారు. నా బయోపిక్ అంటూ తీస్తే దానికి రామ్ చరణ్ అద్భుతంగా నటిస్తాడు. అందులో ఎలాంటి అనుమానం అక్కరలేదు. కానీ సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ లు నటిస్తే బాగుంటుందని అన్నాడు. తాజాగా దీనిపైన హీరో సాయి ధరమ్ తేజ్ కూడా స్పందించాడు.

ప్రతి రొజూ పండగే చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా సాయి ధరమ్ తేజ్ చిరంజీవి బయోపిక్ పై స్పందిస్తూ .. మెగాస్టార్‌ బయోపిక్‌కు తాను న్యాయం చేయలేనని, రామ్‌ చరణ్ అయితే తండ్రి పాత్రకు పర్ఫెక్ట్‌ అని చెప్పుకొచ్చాడు. మెగా ఫ్యామిలీలో చిరంజీవి పోలికలు ఎక్కువగా ఉన్న హీరో ఎవరైనా ఉన్నారంటే అది సాయి ధరమ్ తేజ్ ఒక్కడే అని చెప్పాలి. డాన్స్, ఫైట్స్, కామెడీ ఇలా అన్నింటిలోనూ మెగాస్టార్ ని అచ్చు గుద్దినట్టుగా ఇమిటేట్ చేస్తాడు. కానీ ఇప్పుడు మెగాస్టార్ బయోపిక్ కి నేను కరెక్ట్ కాదని చెప్పడంతో మెగాస్టార్ బయోపిక్ లో ఎవరు యాక్ట్ చేస్తారన్న చర్చ మొదలైంది.

ఇక ప్రతి రొజూ పండగే సినిమా విషయానికి వస్తే మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే విడుదలైన సినిమా ట్రైలర్ ,సాంగ్స్ సినిమాపైన భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. ఇందులో సాయికి జోడిగా రాశీఖన్నా నటిస్తుంది. గీతా ఆర్ట్స్ , యువీ క్రియేషన్స్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. తమన్ సంగీతం అందిస్తున్నాడు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories