అలా నాకు సినిమాలు తగ్గాయి : రోహిత్

అలా నాకు సినిమాలు తగ్గాయి : రోహిత్
x
Highlights

లవ్ స్టోరీస్ తో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన హీరో రోహిత్ ... నేను సీత మహాలక్ష్మి, గర్ల్ ఫ్రెండ్ ,కీలుగుర్రం సినిమాలో హీరోగా నటించి మెప్పించారు. అ...

లవ్ స్టోరీస్ తో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన హీరో రోహిత్ ... నేను సీత మహాలక్ష్మి, గర్ల్ ఫ్రెండ్ ,కీలుగుర్రం సినిమాలో హీరోగా నటించి మెప్పించారు. అ తర్వాత శంకర్ దాదా ఎంబీబీఎస్, నవవసంతం సినిమాల్లో ప్రత్యేకమైన పాత్రల్లో కూడా నటించారు. అ తర్వాత అయన సినిమాల్లో కనిపించలేదు. తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు రోహిత్ ...

ఈ ఇంటర్వ్యూలో భాగంగా తనకి సినిమా అవకాశాలు ఎందుకు రాలేదు అన్నదానిపై స్పందించారు రోహిత్ " నేను సినిమా స్క్రిప్ట్ నే ఎక్కువగా నమ్ముతాను. స్క్రిప్ట్స్ బాగుంటేనే సినిమాలు చేసేందుకు ఇష్టపడతాను. నాకు చాలా మంది దర్శకులు వచ్చి సినిమా కథలు చెప్పేవారు. కానీ నేను చాలా ఓపెన్ గా బాగుంటే బాగుందని లేకపోతే లేదని మొఖం మీదే చెప్పేవాడిని ఇలా చెప్పడం వల్ల అది నాకే చాలా బ్యాడ్ అయిపొయింది. అలా నాకు సినిమా అవకాశాలు రావడం తగ్గిపోయయాయి" అని రోహిత్ చెప్పుకొచ్చారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories