RaviTeja: హీరోయిన్స్‌ను రిపీట్ చేస్తున్న మాస్ రాజా

RaviTeja: హీరోయిన్స్‌ను  రిపీట్ చేస్తున్న మాస్ రాజా
x
Hero raviteja repeat the heroins
Highlights

ఈ ఏడాది డిస్కో రాజాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మాస్ మహారాజ్ రవితేజ.. ఎక్కడికి పోతావ్ చిన్నవాడా ఫేం వి ఐ ఆనంద్ దర్శకత్వంలో

సినిమా ఇండస్ట్రీలో హిట్ పెయిర్ కి ఉన్న క్రేజ్ వేరు.. సినిమాకి కథ, దర్శకుడు ఒకెత్తు అయితే హీరో, హీరోయిన్ ఎవరు అన్నది కుడా మెయిన్ పాయింట్.. ఒక్కసారి హిట్ పెయిర్ అని ముద్రపడితే ఆ కాంబినేషన్ లో చాలా సినిమాలు వస్తాయి. లేకపోతే అంతే సంగతులు..కానీ ఇందుకు భిన్నంగా ఉంటాడు హీరో రవితేజ.. జయాపజయాలకు అతీతంగా తన కథానాయికలను ఎంచుకుంటున్నాడు రవితేజ. ఇప్పుడు ఆ స్టొరీపై ఓ లుకేద్దాం

ఈ ఏడాది డిస్కో రాజాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మాస్ మహారాజ్ రవితేజ.. ఎక్కడికి పోతావ్ చిన్నవాడా ఫేం వి ఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందించలేకపోయింది. ఇందులో రవితేజ సరసన పాయల్ రాజ్ పుత్, నభా నటేశ్, తాన్యా హోప్ ముగ్గురు హీరోయిన్స్ నటించారు. వీరితో రవితేజ పనిచేయడం కూడా తోలిసారి. ప్రస్తుతం రవితేజ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ అనే సినిమాని చేస్తున్నాడు. ఇందులో శ్రుతి హాసన్‌ హీరోయిన్ గా నటిస్తోంది.

ఇక ఈ సినిమా తర్వాత రమేశ్ వర్మ దర్శకత్వంలో తెరకేక్కబోయే 'కిలాడి' సినిమాలో హీరోయిన్ గా మాళవికా శర్మ ఎంపికైంది. గతంలో వీరి కాంబినేషన్ లో నేల టికెట్టు సినిమా వచ్చింది. ఇక కిలాడీ సినిమా అనంతరం త్రినాథరావ్ నక్కిన దర్శకత్వంలో చేయబోయే సినిమాలో హీరోయిన్ గా తమన్నా ఎంపిక అయింది. గతంలో తమన్నా, రవితేజ కలిసి బెంగాల్ టైగర్ చిత్రం కోసం కలిసి పనిచేశారు. ఇక వక్కంతం వంశీ న దర్శకత్వంలో చేయబోయే సినిమాలో హీరోయిన్ గా కాజల్ అని అనుకుంటునట్టుగా సమాచారం.. ఇలా రవితేజ హిట్, ప్లాప్ లకి సంబంధం లేకుండా ఛాన్స్ లు ఇచ్చుకుంటూ వెళ్తున్నాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories