నువ్వు లేకపోతే ఆ సాహసం చేసేవాడిని కాదు : రానా

Rana Daggubati
x
Rana Daggubati
Highlights

సినిమా హీరోలు పాటలు పాడడం అనేది కొత్తేమి కాదు... గతంలో తమ తమ సినిమాల కోసం పలువురు హీరోలు పాటలను పాడారు. అందులో రవితేజ,ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్,మహేష్...

సినిమా హీరోలు పాటలు పాడడం అనేది కొత్తేమి కాదు... గతంలో తమ తమ సినిమాల కోసం పలువురు హీరోలు పాటలను పాడారు. అందులో రవితేజ,ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్,మహేష్ బాబు లాంటి నటులు ఉన్నారు. ఇప్పుడు ఇదే లిస్టులోకి యంగ్ హీరో రానా కూడా చేరిపోయాడు. విశాల్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ సినిమా కోసం రానా ఓ పాట పాడాడు.. యాక్షన్ సినిమాలోని స్టార్ట్ యాక్షన్ కెమెరా అనే పాటను తెలుగులో రానా పాడారు. తమిళ్ లో వేరే గాయకుడూ ఈ పాటను పాడారు.

హిప్ హప్ దీనికి సంగీతం సమకూర్చారు. ఈ విషయాన్నీ తన అధికార ట్వీట్టర్ ద్వారా వెల్లడించారు హిప్ హప్ .." రానా అన్న మొదటిసారిగా పాట పాడాడు. చాలా అద్భుతంగా పాటను ఆలపించారు థాంక్స్ అన్న" అంటూ ట్వీట్ చేసాడు హిప్ హప్.. దీనికి రానా రీప్లేయ్ ఇస్తూ " నువ్వు లేకపోతే ఈ సాహసం చేసేవాడిని కాదు అంటూ ట్వీట్ చేసాడు రానా... యాక్షన్ సినిమాలో విశాల్ కి జోడిగా తమన్నా నటిస్తుంది. దీనికి సి సుందర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 15 న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రానా గుణశేఖర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories