అరణ్య టీజర్ : రానా మహా అద్భుతం

అరణ్య టీజర్ : రానా మహా అద్భుతం
x
Highlights

లీడర్ సినిమాతో హీరోగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు రానా.. విభిన్నమైన కథలు ఎంచుకుంటూ ముందుకు సాగాడు. ఇక బాహుబలి సినిమాలో భల్లాళ దేవుడిగా ఆ పాత్రకు మంచి...

లీడర్ సినిమాతో హీరోగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు రానా.. విభిన్నమైన కథలు ఎంచుకుంటూ ముందుకు సాగాడు. ఇక బాహుబలి సినిమాలో భల్లాళ దేవుడిగా ఆ పాత్రకు మంచి క్రేజ్ వచ్చింది. ఈ సినిమా తర్వాత రానా ఏ సినిమా చేసిన సరే అంచనాలు భారీ స్థాయిలో ఉంటున్నాయి. ఈ నేపధ్యంలో మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు రానా..

ప్రముఖ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ నిర్మిస్తున్న 'అరణ్య' అనే వైవిధ్యమైన చిత్రంలో రానా నటిస్తున్నాడు.. ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో ఏప్రిల్ 2 న ఏకకాలంలో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కి మంచి స్పందన వచ్చింది. తాజాగా చిత్ర యూనిట్ టీజర్‌ను కూడా విడుదల చేశారు. 1:15 నిమిషాల నిడివితో ఉన్న టీజర్‌ ని ప్రేక్షకుడిని మరో లోకం లోకి తీసుకువెళ్ళింది.

హాలీవుడ్ తరహ సినిమానా అన్నట్టుగా టేకింగ్ ఉంది. ఇందులో హీరో రానా మావటివాడిగా నటించాడు. జంతువులంటే అమితమైన ప్రేమ ఉన్న వ్యక్తిత్వం ఉన్న మనిషిగా రానా పాత్ర కనిపిస్తోంది. బాహుబలి తర్వాత రానా కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాగా ఇది నిలుస్తోంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఇక టీజర్ లో కంప్యూటర్ గ్రాఫిక్స్‌కు చాలా బాగా చేశారని అర్థమవుతోంది. నేషనల్ అవార్డ్‌ గ్రహీత ప్రభు సాల్మన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో రానాతో పాటు తమిళ నటుడు విష్ణు విశాల్, ప్రభు సాల్మోన్, శ్రియ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి.

ఇక ఈ సినిమాతో పాటు రానా విరాటపర్వం అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో రానాకి జోడిగా సాయిపల్లవి నటిస్తుంది. దీనికి వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. దీని తర్వాత గుణశేఖర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు రానా. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది..


Show Full Article
Print Article
More On
Next Story
More Stories