రియల్ గన్ తో రామ్

రియల్ గన్ తో రామ్
x
Ram ( File Photo )
Highlights

హీరోలు అన్నాక గన్ పట్టుకోరా ఏంటి? అందులో కొత్తేమి ఉంది అనుకోవచ్చు.. హీరోలు గన్ పట్టుకునేది కేవలం సినిమాల్లోనే ..

హీరోలు అన్నాక గన్ పట్టుకోరా ఏంటి? అందులో కొత్తేమి ఉంది అనుకోవచ్చు.. హీరోలు గన్ పట్టుకునేది కేవలం సినిమాల్లోనే .. రియల్ గా పట్టుకోవాలి అంటే లైసెన్స్ వుండాలి. లైసెన్స్ ఉంది కదా అని వాడతాం అంటే కుదరదు కూడా అవసరం కూడా రావాలి కూడా .. కానీ రామ్ కి అవకాశం వచ్చింది. పోలీసులకు గత 25 ఏళ్లుగా ఏకే 47 వంటి తుపాకులు సరఫరా చేసే జెన్ టెక్నాలజీస్ సంస్థ హైదరాబాద్‌లో నిర్వహించిన సిల్వర్ జూబ్లీ వేడుకలకు రామ్ పోతినేనిని ముఖ్య అతిథిగా ఇన్వైట్ చేసింది.

దీనికి రామ్ అటెండ్ అయ్యాడు. అందులో భాగంగా అక్కడ ఉన్న పలు గన్ లు తీసుకుని, గన్స్ ఎలా పట్టుకోవాలి, ఎలా గురి పెట్టాలి. ఎలా పేల్చాలి లాంటి వంటి విషయాలు అడిగి తెలుసుకున్నాడు. తన తర్వాతి సినిమాకి సినిమాకు ఉపయోగపడుతుందని వాటికీ సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నాడు.

ఆ సందర్భంగా రామ్ మాట్లాడుతూ ఎప్పుడు సినిమాల్లోనే డమ్మీ గన్ తో పనిచేసే మాకు ఇప్పుడు ఇలా రియల్ గన్స్ ని ప్రత్యేక్షంగా చూడడం బాగుందని అన్నాడు. ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసినందుకు గాను జెన్ టెక్నాలిజీస్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసాడు. ఈ సందర్భంగా సంస్ధ ఎండీ చైర్మన్ అశోక్ అట్లూరి ఈ సందర్భంగా రామ్‌‌ను జ్ఞాపికతో సత్కరించారు.

ఈ సంవత్సరంలో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి సక్సెస్ ని అందుకున్న రామ్ ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో రెడ్ అనే సినిమాని చేస్తున్నాడు. గతంలో వీరి కాంబినేషన్లో నేను శైలజ, ఉన్నది ఒక్కటే జిందగీ సినిమాలు వచ్చి మంచి విజయాన్నీ అందుకున్నాయి. ఇక ఈ రెడ్ సినిమాని స్రవంతి రవికిషోర్ నిర్మిస్తుండగా, మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories