ఇస్మార్ట్‌ శంకర్‌' చూసిన రాంచరణ్‌ రియాక్షన్‌ ఇదే..

ఇస్మార్ట్‌ శంకర్‌ చూసిన రాంచరణ్‌ రియాక్షన్‌ ఇదే..
x
Highlights

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కించిన సినిమా "ఇస్మార్ట్ శంకర్". ఈనెల 19న విడుదలైన ఈ సినిమా థియేటర్లలో...

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కించిన సినిమా "ఇస్మార్ట్ శంకర్". ఈనెల 19న విడుదలైన ఈ సినిమా థియేటర్లలో దూమ్మురేపుతోంది. మాస్ మసాలతో కలిపి ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. రామ్ నటన అందరిని ఆకట్టుకుంది. కాగా తొలి నాలుగు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.48 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. తరువాత ఆరు రోజుల్లో రూ.56 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. 8 రోజుల్లో రూ.61 కోట్లు రాబట్టింది. ఇదిలా ఉంటే మెగా హీరో రాంచరణ్ ఈ సినిమాపై స్పందించారు. సినిమా చూసిన అనంతరం రామ్ చరణ్ తన ఫేస్ అకౌంట్ ద్వారా తన అభిప్రాయం పంచుకున్నారు.

మొదటగా సినిమా దర్శకుడు పూరీపై ప్రశంసల వర్షం కురిపించాడు. పూరీ జగన్నాథ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఇస్మార్ శంకర్ సినిమా నచ్చిందని తెలిపారు. రామ్ ఇతర నటీనటులు చాలా చాలా ఎనర్జిటిక్ గా నటించారు అని అన్నారు. అన్నింటినీ ఒక్కచోటుకు చేర్చి, ఓ మంచి సినిమా తీసిన వ్యక్తి ఆయన' అని పోస్ట్‌ చేశారు. దీనికి హీరో రామ్‌ ట్విటర్‌లో స్పందించారు. ధన్యవాదాలు సోదరా' అని పోస్ట్‌ చేశారు. ఇటు నటుడు సుమంత్‌ కూడా పూరీకి శుక్రవారం అభినందనలు తెలిపారు. ఇస్మార్ట్‌ శంకర్‌' విజయం అందుకున్నందుకు రామ్‌, పూరీ, ఛార్మిలకు శుభాకాంక్షలు తెలిపారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories