కారు ప్రమాదం కేసులో హీరో రాజ్ తరుణ్ అరెస్ట్

కారు ప్రమాదం కేసులో హీరో రాజ్ తరుణ్ అరెస్ట్
x
Highlights

కారు ప్రమాదం కేసులో హీరో రాజ్ తరుణ్‌ను అరెస్ట్ చేశారు. 279, 336 కింద కేసు నమోదు చేసిన పోలీసులు రాజ్ తరుణ్ స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. అలాగే 41 CRPC...

కారు ప్రమాదం కేసులో హీరో రాజ్ తరుణ్‌ను అరెస్ట్ చేశారు. 279, 336 కింద కేసు నమోదు చేసిన పోలీసులు రాజ్ తరుణ్ స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. అలాగే 41 CRPC కింద నోటీసులు ఇచ్చారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేశాడా లేదా అనేది తమకు ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు. మరోవైపు యాక్సిడెంట్ వీడియోతో బ్లాక్ మెయిల్ చేసిన కార్తీక్‌‌‌ను కూడా అరెస్ట్ చేశారు.

రెండు రోజుల క్రితం హైదరాబాద్ నార్సింగ్‌లో రాజ్ తరుణ్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి నుంచి రాజ్ తరుణ్ వెళ్లిపోయాడు. అయితే అతడు పరుగుపెడుతున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. అలా ఎందుకు పరుగు పెట్టాడో కూడా తెలియలేదు. అనంతరం ఘటన‌పై రాజ్ తరుణ్ స్పందించాడు. తనకు ఎలాంటి గాయాలు కాలేదని తెలిపాడు.

అయితే ఆ తర్వాత కారు ప్రమాదం కేసు మరో మలుపు తిరిగింది. ప్రమాదం తరువాత రాజ్ తరుణ్ వీడియోలను కాస్టూమ్ డిజైనర్ కార్తీక్ తీసి బెదిరింపు‌లకు పాల్పడ్డాడని మాదాపూర్‌ పోలీస్ స్టేషన్‌లో ఆర్టీస్ట్ రాజా రవీంద్ర ఫిర్యాదు చేశారు. అయితే కార్తీక్ వాదన వేరేలా ఉంది. వీడియోలు డిలీట్ చేయాలని తనని బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ కార్తీక్ మీడియా ముందుకు వచ్చాడు. ఈ క్రమంలో రాజ్ తరుణ్ వీడియోలు డిలీట్ చేయాలని రాజా రవీంద్ర, మరో మహిళ తనపై ఒత్తిడి తెచ్చారంటూ రెండు ఆడియోటేపులను విడుదల చేశాడు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories