ఫాన్స్ కి ప్రామిస్ చేసిన ప్రభాస్....

ఫాన్స్ కి ప్రామిస్ చేసిన ప్రభాస్....
x
Highlights

బాహుబలి లాంటి భారీ సినిమా తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం సాహో .. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి . సాహో సినిమాకి గాను ప్రభాస్ దాదాపుగా రెండేళ్ళు కేటాయించాడు .

బాహుబలి లాంటి భారీ సినిమా తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం సాహో .. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి . సాహో సినిమాకి గాను ప్రభాస్ దాదాపుగా రెండేళ్ళు కేటాయించాడు . దీనికంటే ముందువచ్చిన బాహుబలి సినిమాకి నాలుగేళ్ళు కేటాయించాడు ప్రభాస్.. అంటే మూడు సినిమాలకి గాను ప్రభాస్ తీసుకున్న టైం ఆరేళ్ళు అన్నమాట .. అయితే ఇక ముందు చేయబోయే సినిమాలకి అంతా టైం తీసుకోనని ప్రభాస్ చెప్పుకొచ్చాడు . సాహో హిందీ ట్రైలర్ లాంచ్ లో భాగంగా ప్రభాస్ ఈ విషయాన్ని వెల్లడించాడు . సంవత్సరానికి రెండు సినిమాలు విడుదల అయ్యేలా చూసుకుంటానని ప్రభాస్ చెప్పుకొచ్చాడు . యువీ క్రియేషన్స్ నిర్మాణ సారధ్యంలో సాహో సినిమా ఆగస్టు 30 న విడుదల కానుంది . ఇందులో ప్రభాస్ కి జోడిగా బాలీవుడ్ నటి శ్రద్దాకపూర్ నటిస్తుంది .


Show Full Article
Print Article
More On
Next Story
More Stories