నితిన్‌కు కాబోయే భార్య షాలినీ ఎవరో తెలుసా?

నితిన్‌కు కాబోయే భార్య షాలినీ ఎవరో తెలుసా?
x
Highlights

టాలీవుడ్ లో మోస్ట్ బ్యాచిలర్ గా కొనసాగుతున్న హీరోలలో ఒకడైనా నితిన్ ఎట్టకేలకు పెళ్లిపీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే.

టాలీవుడ్ లో మోస్ట్ బ్యాచిలర్ గా కొనసాగుతున్న హీరోలలో ఒకడైనా నితిన్ ఎట్టకేలకు పెళ్లిపీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. షాలిని అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నాడు నితిన్.. నిన్న హైదరాబాద్‌లోని నితిన్ నివాసంలో అత్యంత సన్నిహితుల మధ్య ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ విషయాన్ని నితిన్ స్వయంగా తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఏప్రిల్ 16 దుబాయ్ లో వీరి వివాహం జరగనుందని తెలుస్తోంది. ఆ తర్వాత హైదరాబాదులో గ్రాండ్ గా రిసిప్షన్ ని నిర్వహించనున్నారని తెలుస్తోంది. అయితే నితిన్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరు ? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అన్న సందేహాలు చాలా మందిలో నెలకొన్నాయి. కానీ ఆమెకంటూ సోషల్ మీడియా అకౌంట్స్ కూడా లేవు.

షాలిని రెడ్డి 1989 సెప్టెంబర్ 27న జన్మించింది. ప్రస్తుతం ఆమె వయసు 30 సంవత్సరాలు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా కందుకూరు ఆమె జన్మస్థలం. తన తల్లితండ్రులు ఇద్దరు వైద్యవృత్తికి చెందినవారు. తన చిన్నప్పుడే తన ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్ కి షిఫ్ట్ అయింది. దీనితో హైదరాబాదులోని సెయింట్ మేరీస్ హైస్కూల్‌లో షాలిని తన స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసింది. ఇక లండన్‌లో ఎంబీఏ పూర్తి చేసింది. ప్రస్తుతం ఒక మల్టీ నేషనల్ కంపెనీలో హెచ్‌ఆర్‌లో ఉద్యోగం చేస్తోంది. కామన్ ఫ్రెండ్ వల్ల నితిన్ , షాలిని రెడ్డికి 2012లో స్నేహం ఏర్పడింది. స్నేహం కాస్తా ప్రేమగా మారింది. ఆ తర్వాత పెద్దల్ని ఒప్పించి ఇప్పుడు పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు.

ప్రస్తుతం నితిన్ 'భీష్మ' అనే సినిమాలో నటించాడు. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకి ఛలో ఫేం వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. ఈ సినిమా మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 21 న విడుదల కానుంది. ఈ సినిమాలో నితిన్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. సితార ఎంటర్టైన్మెంట్ పై నాగవంశీ ఈ సినిమాని నిర్మించారు. సినిమా ప్రమోషన్ లో భాగంగా చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 17న ఘనంగా నిర్వహించనున్నారు. సినిమాపైన మంచి అంచనాలు ఉన్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories