నితిన్ పెళ్లి ఫిక్స్ .. వధువు ఎవరంటే?

నితిన్ పెళ్లి ఫిక్స్ .. వధువు ఎవరంటే?
x
Highlights

తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్ బాగానే ఉన్నారు. అందులో నితిన్ ఒకరు. 2002లో జయం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన నితిన్

తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్ బాగానే ఉన్నారు. అందులో నితిన్ ఒకరు. 2002లో జయం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన నితిన్ సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు కానీ పెళ్లెప్పుడో మాత్రం చెప్పడం లేదు... ఆ మధ్య శ్రీనివాస కళ్యాణం సినిమా అప్పుడు త్వరగా పెళ్లి చేసుకుకోవాలని ఉందని అంటూ చెప్పుకొచ్చాడు. ఇక నితిన్ పెళ్లి మ్యాటర్ పై గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కానీ దీనిపైన ఇటు నితిన్ కానీ అటు అతని కుటుంబ సభ్యులు కానీ స్పందించింది లేదు.

అయితే ఇప్పుడు దీనికి సంబంధించిన వార్త ఒకటి ఫిలిం న‌గ‌ర్ స‌ర్కిల్‌లో చ‌క్క‌ర్లు కొడుతుంది. ఏప్రిల్ 16న దుబాయ్‌లోని ప్యాలసో వెర్సేస్‌ హోటల్‌లో నితిన్ వివాహం చేసుకోనున్నాడ‌ని, 14,15 తేదీల‌లో ప్రీ వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్ జ‌ర‌గ‌నున్న‌ట్టు తెలుస్తోంది. అయితే నితిన్ చేసుకోబోయే అమ్మాయి పేరు షాలిని కాగా, ఆమె లండ‌న్‌లో ఎంబీఏ చేసింద‌ట‌. నాలుగేళ్లుగా ప్రేమ‌లో ఉన్న వీరిరివురు పెద్ద‌ల అంగీకారంతో ఇప్పుడు పెళ్లి పీటలెక్క‌బోతున్న‌ట్టు తెలుస్తోంది.అయితే దీనిపైన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఇక నితిన్ ప్రస్తుతం భీష్మ అనే సినిమాలో నటిస్తున్నాడు. రష్మిక మందన్నా కథానాయకగా నటిస్తున్న ఈ సినిమాని ఛలో ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా విడుదలైన సినిమా టీజర్ కి మంచి స్పందన లభించింది. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ సినిమాని వచ్చే నెల ఫిబ్రవరి 21 న రిలీజ్ చేయనున్నారు. సినిమాపైన మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తుండగా సాగర్ సంగీతం అందిస్తున్నారు

ఈ సినిమాతో పాటు నితిన్ విభిన్నమైన కథలు తెరకెక్కించే చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఓ సినిమాని, తొలిప్రేమ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే చిత్రంలో నటిస్తున్నాడు. రంగ్ దే చిత్రంలో నితిన్ కి జోడిగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఇక కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ సినిమాని చేసేందుకు పిక్స్ అయ్యాడు నితిన్.. ఈ సినిమాలు ఈ సంవత్సరంలో విడుదల కానున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories