కొత్త దర్శకుడితో నాని ప్రయోగం..

కొత్త దర్శకుడితో నాని ప్రయోగం..
x
Highlights

కొత్త కొత్త ప్రయోగాలూ చేయడంలో హీరో నాని ఎప్పుడు ముందుంటాడు. అందులో భాగంగానే అష్టా చమ్మా,ఎవడే సుబ్రహ్మణ్యం, భలే భలే మగాడివోయ్, జెంటిల్ మేన్, జెర్సీ...

కొత్త కొత్త ప్రయోగాలూ చేయడంలో హీరో నాని ఎప్పుడు ముందుంటాడు. అందులో భాగంగానే అష్టా చమ్మా,ఎవడే సుబ్రహ్మణ్యం, భలే భలే మగాడివోయ్, జెంటిల్ మేన్, జెర్సీ లాంటి కథలు వచ్చాయి. హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా నాని ఎంచుకునే కథలు విభిన్నంగా ఉంటాయి. ప్రశాంత్ వర్మ అనే నూతన దర్శకుడుతో అ ! అనే సినిమాని తెరకెక్కించి నిర్మాతగా తన అభిరుచి ఏంటో చెప్పాడు నాని . ఇప్పుడు మహేష్ అనే నూతన దర్శకుడు చెప్పిన కథకి నాని ఫిదా అయ్యాడట..! కొత్తరకం కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని నాని నిర్మిస్తాడా? లేకా హీరోగా చేస్తాడా ? అది కాకుండా చిత్రాన్ని నిర్మిస్తూ నటిస్తాడా అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఇంద్రగంటి మోహన్ దర్శకత్వంలో వీ అనే సినిమాని చేస్తున్నాడు నాని. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories